Pavala Shyamala : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత
ప్రముఖ సినీ నటి పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2026 / 07:52 AM IST
Actress Pavala Shyamala Passes Away
Pavala Shyamala : టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. జూలై 28 తెల్లవారుజామున సుమారు 1.52 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.
పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ జీవనం సాగించారు. గతంలో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థి సాయం అందజేశారు.
NTR : ఎన్టీఆర్ కి గాయం.. రెండు నెలలు రెస్ట్.. ఆందోళనలో అభిమానులు..
1985లో బాబాయ్ అబ్బాయ్‌తో మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకమైన హాస్య, సహాయ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గోలీమార్, ఖడ్గం, ఆంధ్రావాలా, వర్షం వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి.
మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితర అగ్ర హీరోలతో కలిసి ఆమె పలు చిత్రాల్లో నటించారు. చిన్న పాత్రైనా తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పావలా శ్యామల ప్రత్యేకతగా నిలిచింది. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
