NTR : ఎన్టీఆర్ కి గాయం.. రెండు నెలలు రెస్ట్.. ఆందోళనలో అభిమానులు..
తాజాగా ఎన్టీఆర్ టీమ్ దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.(NTR)
NTR
NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రా ఎన్టీఆర్ సంస్థ చేసిన పనులు, ప్రచారాలతో ఎన్టీఆర్ కూడా కొన్ని రోజులు వార్తల్లో నిలిచారు. తాజాగా ఎన్టీఆర్ కి గాయం అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఎన్టీఆర్ కి డ్రాగన్ సినిమా షూటింగ్ లో భుజానికి గాయం అయిందని, వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారని సమాచారం. తాజాగా ఎన్టీఆర్ టీమ్ దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Also Read : Allu Arjun : హీరోయిన్ లేకుండానే అల్లు అర్జున్ సినిమా.. బన్నీ కొత్త ప్రయోగం ఆ డైరెక్టర్ కోసం..
ఎన్టీఆర్ టీమ్ రిలీజ్ చేసిన ప్రకటనలో.. ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ గారి భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం చేసిన సమగ్ర వైద్య పరీక్షల అనంతరం ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అందరికీ హామీ ఇస్తున్నాము. ఆయన ఆరోగ్యం, కోలుకోవడం గురించి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాము అని తెలిపారు.
దీంతో అసలు ఏం గాయం అయింది? ఆపరేషన్ జరిగిందా? లేక ఎలాంటి గాయం అని అభిమానులు ఆందోళన చెందుతూ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో డ్రాగన్ షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడింది.

