Allu Arjun : హీరోయిన్ లేకుండానే అల్లు అర్జున్ సినిమా.. బన్నీ కొత్త ప్రయోగం ఆ డైరెక్టర్ కోసం..
తాజాగా అల్లు అర్జున్ చేయబోయే ఓ సినిమాలో అసలు హీరోయినే ఉండదట. (Allu Arjun)
Allu Arjun
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆల్రెడీ దీపికా పదుకోన్ మెయిన్ లీడ్ అని ప్రకటించారు. ఆమె కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ చేయబోయే ఓ సినిమాలో అసలు హీరోయినే ఉండదట.
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. AA23 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ చిన్న వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో అసలు హీరోయినే ఉండదట. గతంలో లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్, కూలి.. సినిమాల్లో కూడా హీరోయిన్, డ్యూయెట్స్, లవ్ లేకుండానే హీరోతో సినిమా నడిపించారు.
Also Read : KJQ Trailer : KJQ ట్రైలర్ వచ్చేసింది.. డైరెక్టర్ మరణం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా..
ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే ప్లాన్ చేస్తున్నాడట లోకేష్ కనగరాజ్. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఎలాంటి కమర్షియల్ జోలికి, అక్కర్లేని లవ్, సాంగ్స్ జోలికి పోకుండా కేవలం కథకు తగ్గట్టు ఈ సినిమాని తీయబోతున్నాడట లోకేష్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
గతంలో అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో హీరోయినే లేకుండా తన పాత్ర గెస్ట్ అప్పీరెన్స్ గా నటించాడు. అది తప్ప అన్ని సినిమాల్లో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఉంది. మరి హీరోయిన్ లేకుండా ఈ AA23 సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

