పూజా పాప ల్యాండ్ అయిందిగా..

  • Publish Date - September 13, 2020 / 10:02 PM IST

Pooja Hegde Spotted at Airport: లాక్‌డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఎప్పుడూలేనంత ఫ్రీ టైం దొరికింది. ఈ సమయాన్ని ఎవరెవరు ఎలా ఉపయోగిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మెల్లగా కొన్ని షూటింగులు ప్రారంభమవుతున్నాయి. అయితే హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలేవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.


ఈ విరామం సమయంలో పూజా చెఫ్‌గా మారిపోయింది. వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. కట్ చేస్తే తాజాగా పూజా పాప హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయింది.
ఆదివారం పూజా ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఈ వార్త కన్ఫామ్ అయిపోయింది.


వైట్ టీషర్ట్, జీన్స్ స్కర్ట్‌తో రెట్రో లుక్‌లో పూజా కట్టిపడేసింది. ప్రస్తుతం పూజ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’, యంగ్ హీరో అఖిల్‌ అక్కినేనితో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కూడా షూటింగ్స్‌కు రెడీగా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు పూజా.. ‘రాధేశ్యామ్‌’ జార్జియా షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.