actress prameela raani
Prameela Rani : నటి ప్రమీలా రాణి టీవీ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ మీద మంచి పేరు తెచ్చుకున్నారు . 45 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నారు. 85 పైగా సినిమాలు చేసిన ప్రమీలా రాణి ఇటీవల ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.
మొదట్లో నాటకాలు వేసిన అనుభవంతో నటి ప్రమీలా రాణి ‘వద్దు బావా తప్పు’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆమెకి 14 ఏళ్ళకి పెళ్లి చేసేసారట. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆమెకి డాక్టర్స్ పిల్లలు పుట్టారని చెప్పారన్న నెపంతో భర్త వదిలిపెట్టేసాడట. ఆ తర్వాత బాబురావు అనే వ్యక్తిని ప్రమీలా పెళ్లాడారు. అప్పటికే అతనికి పెళ్లి అయ్యిందని తెలియలేదట. ఆ తర్వాత ప్రమీలాకి కొడుకు పుట్టాడట. 23 ఏళ్ళకి రెండవ భర్త బాబురావు చనిపోయారట.
భర్త చనిపోవడంతో నాటకాలు, సినిమాలు వేయడం మొదలుపెట్టారట ప్రమీలా రాణి. మనసు మమత, భార్యా మణి వంటి సీరియల్స్‌తో పాటు వద్దు బావా తప్పు, విక్రమార్క, వేదం, బాహు బలి, వకీల్ సాబ్ ఇలా 85 వరకు సినిమాల్లో నటించారు.
Ram Charan : ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్ చరణ్.. అయ్యప్పమాలలో..
ఒక సినిమా అవకాశం విషయంలో ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పారు ప్రమీలా రాణి. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు అంటూ ప్రమీలా రాణి వాపోయారు. వారి తీరు నచ్చక ఆ సినిమా అవకాశాన్ని వదిలేసుకున్నా అని చెప్పుకొచ్చారావిడ. డబ్బింగ్ ఆర్టిస్ట్ విజయరాణి తన దగ్గర రూ. 15 లక్షలు తీసుకుని ఎగ్గొట్టేసిందని చెప్పారు. ఇలాంటి చేదు అనుభవాలు తప్ప సినిమా ఇండస్ట్రీ ఇప్పటికి తనని ఆదరిస్తోందని ప్రమీలా రాణి చెప్పారు.