Nagavamsi : నాకు తెలిసింది ఇద్దరు యాంకర్లే.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..
ఈ వివాదంపై నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
Nagavamsi
Nagavamsi : నిర్మాత నాగవంశీ తన సినిమాలతో పాటు తన ఇంటర్వ్యూలు, స్పీచ్ లతో కూడా వార్తలో నిలుస్తారు. సోషల్ మీడియాలో నాగవంశీ రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ మీకు ఏ హీరోయిన్, యాంకర్ మీద క్రష్ ఉంది అని అడగ్గా యాంకరా అంటూ ఆశ్చర్యపోతూ ఓ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.(Nagavamsi)
అయితే పలువురు యాంకర్స్ అంటే తక్కువా అని నాగవంశీ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Inaya Sulthana : బ్లౌజ్ లేకుండా చీర కట్టుకుంటాం అదే మన కల్చర్.. శివాజీ వ్యాఖ్యలపై ఇనయా సుల్తానా కామెంట్స్..
నాగవంశీ మాట్లాడుతూ.. నేను యంకరా అని ఎవర్ని తక్కువ చేసి అనలేదు. నాకు తెలిసింది ఇద్దరే యాంకర్స్. సుమ గారు, మా ప్రదీప్ గాడు. సుమ గారు అంటే అక్క, తల్లి అలా చూస్తాము. సుమ మాకు ఫ్యామిలీ లాంటిది. ప్రదీప్ మగాడు అతన్ని ప్రేమించడం, ఇష్టపడటం లాంటిది ఉండదు. ప్రదీప్ నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. నాకు వాళ్లిద్దరే తెలుసు. శ్రీముఖి గారు చేస్తారని తెలుసు. ఆవిడ ఇంక మా సినిమాలకు చేయలేదు. వేరే యాంకర్స్ ఎక్కువగా తెలీదు. మాములుగా యాంకర్స్ గురించి అడగరు కదా. ఆయన అలా యాంకర్స్ లో క్రష్ అని అడిగేసరికి ఆశ్చర్యపోయి యాంకర్ ఏంటి అని అన్నాను. అంతే కానీ ఎవర్ని తక్కువ చేయాలని కాదు అని తెలిపారు.
