Mohanlal : మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal)ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
Mohanlal Mother Santhakumari Dies At 90
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు.
శాంతకుమారి గత కొన్నాళ్లుగా వృద్దాప్య, పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కొన్నాళ్లుగా మంచానికే పరిమితం అయ్యారు. ఆమెను మోహన్ లాల్ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. తన నివాసంలోనే ఆమెకు చికిత్స ను అందిస్తున్నారు.
Nagavamsi : నాకు తెలిసింది ఇద్దరు యాంకర్లే.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..
శాంతకుమారి భర్త దివంగత విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రటరీగా పని చేశారు.
తల్లి మరణవార్త తెలియగానే మోహన్ లాల్ ఎర్నాకుళంలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రాత్రికి శాంతకుమారి పార్థివదేహాన్ని తిరువనంతపురం తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. శాంతకుమారి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
