Inaya Sulthana : ఫిజికల్ గా వాడుకొని వదిలేసాడు.. నన్ను అప్పుల్లో ముంచేసి.. లవ్ బ్రేకప్ పై ఇనయా ఎమోషనల్..

ఇనయా సుల్తానా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనితో బ్రేకప్ అయిందని, వాడుకొని వదిలేసాడు అని చెప్తూ ఎమోషనల్ అయింది. (Inaya Sulthana)

Inaya Sulthana : ఫిజికల్ గా వాడుకొని వదిలేసాడు.. నన్ను అప్పుల్లో ముంచేసి.. లవ్ బ్రేకప్ పై ఇనయా ఎమోషనల్..

Inaya Sulthana

Updated On : December 30, 2025 / 4:08 PM IST

Inaya Sulthana : ఆర్జీవీతో కనిపించి ఫేమ్ తెచ్చుకున్న నటి ఇనయా సుల్తానా బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉంది. కొన్ని నెలల క్రితం ఇనయా సుల్తానా గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్, యోగా ట్రైనర్ ని తన బాయ్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి అతనితో క్లోజ్ గా దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Inaya Sulthana)

అయితే ఇనయా సుల్తానా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనితో బ్రేకప్ అయిందని, వాడుకొని వదిలేసాడు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Inaya Sulthana : బ్లౌజ్ లేకుండా చీర కట్టుకుంటాం అదే మన కల్చర్.. శివాజీ వ్యాఖ్యలపై ఇనయా సుల్తానా కామెంట్స్..

ఇనయా సుల్తానా తన లవ్ బ్రేకప్ గురించి చెప్తూ.. నేను ఫ్యామిలీకి దూరంగానే ఉన్నా. నాకంటూ ఎవరూ లేరు. అలాంటి టైంలో ప్రేమ అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నాకు మాట్లాడటానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనిపించింది. ఒంటరితనం ఫీలింగ్ తోనే అతనికి దగ్గరయ్యాను. నాన్న ఎమోషన్ కనెక్ట్ అయింది. అతను క్లారిటీగానే ఉన్నాడు. నేనేమో ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని సంతోషపడ్డా. నేను అతన్ని చాలా నమ్మాను. అతన్ని నమ్మి మోసపోయా. నా ఫేమ్, డబ్బులు అన్ని వాడుకొని వదిలేసాడు.

అతన్ని లవ్ చేసి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కలనాలని చాలా లైఫ్ ఊహించుకున్నా. ఫిజికల్ గా వాడుకొని వదిలేసాడు. మేము క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అతనే పెట్టమన్నాడు. కానీ నేను ఎక్కువ సక్సెస్ అవుతున్నాను అని గొడవలు. నేను చేసే సినిమాల్లో కూడా అతనికి ఆఫర్స్ ఇప్పించాను. నా సక్సెస్ తో అతను జెలస్ ఫీల్ అయ్యాడు. షూట్ ఉంది అంటే ముందు రోజు నైట్ గొడవలు పెట్టేవాడు. అందరి ముందు తిట్టేవాడు.

Also See : Vishnupriyaa Bhimeneni : గోవా బీచ్ లో బికినీ వేసి రచ్చ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్..

నాతో ఒక బిజినెస్ పెట్టించి మొత్తం ముంచేశాడు. గోల్డ్ తాకట్టు పెట్టి అతనికి 4 లక్షలు ఇచ్చాను. బ్రేకప్ అయ్యేసరికి మొత్తం లాస్, అప్పుల్లోనే మిగిలాను. సూసైడ్ చేసుకోవాలనుకున్న కానీ చేయలేదు. మొదట బాధపడ్డా కానీ తర్వాత దరిద్రం పోయింది అనుకున్నాను. బ్రేకప్ తర్వాత కూడా ఓ సినిమాలో అతనితో రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వచ్చింది. బ్రేకప్ తర్వాత రోజూ ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చాను అంటే వోకల్ కార్డ్స్ పోయాయి. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.