Actress Prashanthi Harathi daughter Tanya Harathi video album Teluginti Samskruthi Released in Raghavendra Rao Channel and get good Response
Prashanthi Harathi : పెళ్లాం ఊరెళితే, ఇంద్ర(Indra) వంటి పలు సినిమాల్లో నటించిన ప్రశాంతి హారతి ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలై సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైనా తెలుగు సంసృతికి దగ్గరగా ఉంటూ అమెరికాలోనే(America) ఓ కూచిపూడి(Kuchipudi) నాట్యం నేర్పే సంస్థని స్థాపించి అక్కడి వారికి నాట్యం నేర్పిస్తూ మన తెలుగు సంసృతిని ప్రమోట్ చేస్తుంది.
నటి ప్రశాంతి హారతి తన కూతురు తాన్య హారతితో(Tanya Harathi) కలిసి ఇటీవల ఓ వీడియో ఆల్బమ్ ‘తెలుగింటి సంస్కృతి’ని రిలీజ్ చేసింది. ఈ వీడియో ఆల్బమ్ ని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేయగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన యూట్యూబ్ ఛానల్ KRR వర్క్స్ లో కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. అమెరికాలో కూచిపూడి నాట్యం నేర్పిస్తూ, కూతురికి తెలుగు సంసృతిని నేర్పిస్తున్న తల్లి నేపథ్యంలో వచ్చిన ఈ వీడియో ఆల్బమ్ బాగా క్లిక్ అయి 1 మిలియన్ వ్యూస్ కూడా అందుకుంది.
Also Read : Prabhas : ప్రభాస్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మారుతి.. వచ్చే నెల నుంచి..
తాజాగా ఈ తెలుగింటి సంస్కృతి వీడియో 1 మిలియన్ వ్యూస్ సాధించినందుకు అమెరికా టెక్సాస్ లోని ఫ్రిస్కోలో సెలబ్రేషన్స్ నిర్వహించారు. నిర్మాత రాధాకృష్ణ హారతి ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసిన డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దీనికి పనిచేసిన ఎడిటర్స్ మురళి రుద్ర, అన్వేష్ మావిళ్ళపల్లి, ఆనంద్ పవన్ నాయుడు, సంగీతం అందించిన SA ఖుద్దూస్, ఇంత క్లాసిక్ సాంగ్ రాసిన శ్రీ రామ్ తపస్వి, కెమెరా టీం శ్యామ్ కట్రు, పృథ్వీ తేజ, కమల్ నందికొండలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటని తన యూట్యూబ్ ఛానెల్ #KRRWorksలో ప్రదర్శించినందుకు దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారికి టీమ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.