Actress Rohini Sensational Post on Nandi Award which announced to her but not received
Actress Rohini : సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి రోహిణి సీరియల్స్ లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ లాంటి టీవీ షోలలో కనిపించి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీగా ఉంది రోహిణి. అయితే తాజాగా రోహిణి తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
గత కొన్నాళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు(Nandi Awards) ఇవ్వడం ఆపేసిన సంగతి తెలిసిందే. సినిమా, టీవీ, నాటకాలు.. ఏ కేటగిరిలోను అవార్డులు ఇవ్వలేదు. దీనిపై టాలీవుడ్ లో చర్చలు జరిగాయి, ప్రభుత్వాలతో మాట్లాడారు, అయినా నంది అవార్డులు ఇవ్వలేదు. అయితే రోహిణి కెరీర్ మొదట్లో చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో తన పాత్రకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటిస్తూ తనకి పంపిన లెటర్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
2018లో 2014 సంవత్సరం అవార్డులు ప్రకటించగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో రోహిణి పాత్రకు బెస్ట్ టీవీ కమెడియన్ గా నంది అవార్డు ప్రకటించినట్టు, అందుకు నంది అవార్డు, పదివేల రూపాయలు ఇస్తాం అని లెటర్ పంపించారు. అయితే ఆ లెటర్ ఇప్పుడు రోహిణి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫస్ట్ సీరియల్ కి నంది అవార్డు వచ్చింది. కానీ ఇప్పటివరకు నాకు అది అందలేదు. నా కెరీర్ లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఒక మంచి జ్ఞాపకం. గతంలో నేను సాధించిన దాన్ని జస్ట్ ఇలా షేర్ చేయాలనుకున్నాను అని పోస్ట్ చేసింది.
Also Read : Naveen Chandra : సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర ఏం చేసేవాడో తెలుసా? ‘ఆర్కుట్’ వల్లే సినిమా ఛాన్స్..
దీంతో రోహిణి పోస్ట్ వైరల్ గా మారింది. కొంతమంది దీన్ని రాజకియ కోణంలో చూస్తూ అప్పుడెప్పుడో ప్రకటించి ఇవ్వకపోతే ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేసావు అని ప్రశ్నిస్తుంటే, కొంతమంది మాత్రం అభినందిస్తున్నారు. మొత్తానికి నంది అవార్డు ప్రకటించినా ఇవ్వలేదు అని రోహిణి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.