Naveen Chandra : సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర ఏం చేసేవాడో తెలుసా? ‘ఆర్కుట్’ వల్లే సినిమా ఛాన్స్..

ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్వహిస్తున్న దావత్ అనే ప్రోగ్రాంకి ఇంటర్వ్యూకి వచ్చిన నవీన్ చంద్ర బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Naveen Chandra : సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర ఏం చేసేవాడో తెలుసా? ‘ఆర్కుట్’ వల్లే సినిమా ఛాన్స్..

Do You Know Actor Naveen Chandra work Before entering into Movies

Updated On : February 13, 2024 / 8:47 AM IST

Naveen Chandra  : అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇప్పుడు కూడా సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్వహిస్తున్న దావత్ అనే ప్రోగ్రాంకి ఇంటర్వ్యూకి వచ్చిన నవీన్ చంద్ర బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఇదే ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో కూడా తెలిపాడు. నవీన్ చంద్ర మాట్లాడుతూ.. నేను ఎక్కడో బళ్లారిలో ఒక మాములు మిడిల్ క్లాస్ అబ్బాయిని. డ్యాన్స్ టీచర్ గా పనిచేసేవాడిని. అప్పట్లో ఆర్కుట్ అనే సోషల్ మీడియా ఉండేది. అందులో నా ఫోటోలు చూసి హను రాఘవపూడి గారు నన్ను పిలిచి అందాల రాక్షసి అవకాశం ఇచ్చారు అని చెప్పారు. దీంతో నవీన్ చంద్ర సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ టీచర్ గా పని చేసినట్టు తెలుస్తుంది. అంటే నవీన్ బాగా డ్యాన్స్ వేస్తాడని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో డ్యాన్స్ పెద్దగా చూపించే అవకాశం రాలేదు. ఫ్యూచర్ లో అయినా ఏదైనా ఒక పాటలో తన డ్యాన్స్ చూపిస్తాడేమో చూడాలి.

Also Read : Sreeleela : బ్రెయిన్ లేని అబ్బాయే కావాలంటున్న శ్రీలీల.. క్యూట్‌గా శ్రీలీల ఇంటర్వ్యూ.. ప్రోమో చూశారా?

అలాగే.. అవకాశం రావడం ఇక్కడ కష్టం, నాకు వచ్చింది. నేను హీరో అవ్వాలనుకోలేదు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో.. ఇలా ఏ రోల్ వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నాను అని తెలిపాడు నవీన్ చంద్ర. అందాల రాక్షసి కంటే ముందు కన్నడలో రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు నవీన్ చంద్ర.