Actress Shazahn padamsee : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్‌

న‌టి షాజ‌న్ ప‌ద‌మ్సీ త్వ‌ర‌లోనే ఓ ఇంటికి ఇల్లాలు కానుంది.

Actress Shazahn padamsee engagement with Ashish Kanakia

Actress Shazahn padamsee : న‌టి షాజ‌న్ ప‌ద‌మ్సీ త్వ‌ర‌లోనే ఓ ఇంటికి ఇల్లాలు కానుంది. త‌న ప్రియుడు ఆశిష్ కనాకియ తో నిశ్చితార్థం చేసుకుంది. బిజినెస్‌మ్యాన్ అయిన ఆశిష్ కనాకియతో ఆమె గ‌త కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రు కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈక్ర‌మంలోనే నిశ్చాతార్థం చేసుకున్నారు.

ఈ విష‌యాన్ని న‌టి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు ఆలోలేక‌పోతున్న‌ట్లు తెలిపింది.

Nayanthara – Dhanush : ధనుష్ వర్సెస్ నయనతార.. ధనుష్ పై విమర్శలు చేస్తూ నయనతార ఫైర్.. ఇంత ఓపెన్ గా లెటర్ రాసి..

ముంబైకి చెందిన షాజ‌న్ ప‌ద‌మ్సీ 2009లో రాకెట్ సింగ్ అనే మూవీతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. ఆ మ‌రుస‌టి ఏడాదే తెలుగులోనూ చిత్రాల‌ను గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ మూవీఓ సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించింది. రూబా అనే పాత్ర‌లో న‌టించింది. యువ‌త హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. ఆ వెంట‌నే మ‌సాలా మూవీలోనూ న‌టించింది. ఆ త‌రువాత తెలుగులో మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు.

Kubera Glimpse : ధ‌నుష్ కుబేర గ్లింప్స్ వ‌చ్చేసింది.. సింగిల్ డైలాగ్ కూడా లేదు.. మొత్తం మ్యూజిక్‌తో..

ఇక త‌న సినీ కెరీర్‌లో ఆరు నుంచి ఏడు సినిమాలు మాత్ర‌మే చేసింది. ప్ర‌స్తుతం ఆమె జీఓఎటీస్ అనే టీవీ షోను చేస్తోంది. ఆశిష్ క‌నాకియా, షాజ‌న్ ప‌ద‌మ్సీ వివాహం వ‌చ్చే ఏడాది జ‌రిగే అవ‌కాశం ఉంది.