Nayanthara – Dhanush : ధనుష్ వర్సెస్ నయనతార.. ధనుష్ పై విమర్శలు చేస్తూ నయనతార ఫైర్.. ఇంత ఓపెన్ గా లెటర్ రాసి..
నయనతార ఫైర్ అవుతూ ధనుష్ పై విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ పెద్ద లెటర్ రాసింది.

Nayanthara Fires on Hero Dhanush Regarding a Legal Notice writes a open Letter goes Viral
Nayanthara – Dhanush : నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18న రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో నేను రౌడీనే(తమిళ్ లో నాను రౌడీ దాన్) సినిమాకు సంబంధించి చిన్న వర్కింగ్ వీడియో ఉంది. నయన్ – ఆమె భర్త విగ్నేష్ ప్రేమలో పడింది ఈ సినిమాతోనే. అయితే ఈ సినిమాకు నిర్మాత ధనుష్ కావడంతో అతని పర్మిషన్ లేకుండా అతని సినిమా విజువల్స్ వాడారంటూ పది కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటిస్ పంపించాడు ధనుష్. అయితే దీనిపై నయనతార ఫైర్ అవుతూ ధనుష్ పై విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ పెద్ద లెటర్ రాసింది.
నయనతార తన లెటర్ లో.. ఒక నటుడిగా, మీ నాన్న, అన్న సపోర్ట్ తో వచ్చిన మీరు ఇది చదివి అర్ధం చేసుకోవాలనుకుంటున్నాను. సినీ పరిశ్రమలో ఎలాంటి కనెక్షన్స్ లేకుండా వచ్చి సొంతంగా ఎదిగిన నాలాంటి వాళ్లందరిది కూడా సినిమా. నేను ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు రుణపడి ఉంటాను. నెట్ ఫ్లిక్స్ లో నాపై తీసిన డాక్యుమెంటరీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది నా ఫ్యాన్స్ కోసమే కాదు ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది పనిచేసారు, సినీ పరిశ్రమలో కూడా ఎంతోమంది ఈ డాక్యుమెంటరీ కోసం కష్టపడ్డారు. మీరు చూపించే ప్రతీకారం నా మీద, నా పార్ట్నర్ మీద మాత్రమే కాదు ఈ డాక్యుమెంటరీ కోసం కష్టపడిన వాళ్లందరిపై ఎఫెక్ట్ పడుతుంది. ఇందులో సినీ పరిశ్రమలోని చాలా మంది వ్యక్తుల క్లిప్స్, సినిమాల్లోని క్లిప్స్ ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకాలు. కానీ నాకు చాలా స్పెషల్, ఇంపార్టెంట్ సినిమా అయినా నేను రౌడీనే లేకపోవడం బాధాకరం.
Also Read : Anurag Kulkarni – Ramya Behara : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా?
రెండేళ్లుగా మీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నాము. ఇక మాకు ఓపిక లేక వదిలేసాము. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు డాక్యుమెంటరీలో నేను రౌడీనే సినిమాకు సంబంధించి ఎలాంటి క్లిప్స్ వాడట్లేదు. ఫోటోలు, మేము తీసుకున్న వీడియోలు కూడా వాడట్లేదు. నేను రౌడీనే సినిమా సాంగ్స్ ఇప్పటికి అభినందిస్తారు. ఆ సాంగ్స్ లో ఎమోషన్ బాగుంటుంది. మా డాక్యుమెంటరీకి అంతకంటే మంచి మ్యూజిక్ ఉండదు అని ఫీల్ అయ్యాం. కానీ మీరు ఈ సినిమా విషయంలో ఏమి సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఇది నా హృదయాన్ని ముక్కలు చేసింది.
సాధారణంగా బిజినెస్ విషయంలో ఇలాంటి పర్మిషన్స్ నేను అర్ధం చేసుకోగలను. కానీ మీరు మాపై వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. ఇంతకంటే నాకు షాకింగ్ విషయం ఏంటంటే మీరు నాకు లీగల్ నోటిస్ పంపించడం. అది కూడా మూడు సెకండ్స్ వీడియో మా ఫోన్స్ లో తీసుకున్నది వాడుకున్నందుకు. 3 సెకండ్స్ వాడుకున్నందుకు 10 కోట్ల లీగల్ నోటిస్ పంపడం ఇది మీ క్యారెక్టర్ ఎంత తక్కువో తెలియచేస్తుంది. మీరు సినిమా ఫంక్షన్స్ లో కనిపించేంత అమాయకులు కారని మీ ఫ్యాన్స్ కు తెలియాలి. మీరు నాకు, నా పార్ట్నర్ కు తీవ్ర అన్యాయం చేసారు. ఒక నిర్మాత నియంతలా వ్యవహరిస్తారా? మీరు ఈ విషయంలో కోర్టులో విజయం సాధించొచ్చు కానీ పైన దేవుడు అనే ఒక కోర్టు ఉంది. అక్కడ నిజాయితీ గెలుస్తుంది.
సినిమా విడుదలై 10 ఏళ్లు పైనే అవుతున్నా ప్రపంచం ముందు ముసుగు వేసుకుని ఇంత నీచంగా కొనసాగడం మీకే చెల్లింది. ఆ సినిమా నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి. అంతేకాకుండా అందరూ ఇష్టపడే సినిమాలో ఒకటి. విడుదలకు ముందు మీరు చెప్పిన మాటలు మాకు ఇప్పటికే మానిపోని మచ్చలను మిగిల్చాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీ ఇగో బాగా దెబ్బ తిందని ఫిల్మ్ సర్కిల్స్ ద్వారా నాకు తెలిసింది. ఈ లెటర్ కేవలం మీకు మనశాంతి రావాలని ప్రార్థించడానికే. వేరేవాళ్ళ సక్సెస్ చూసి జెలస్ ఫీల్ అవ్వొద్దని. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందరిదీ. మీరు దీనికి మీ నెక్స్ట్ సినిమా ఈవెంట్లో పంచ్ లైన్స్ వాడి కౌంటర్లు ఇస్తారేమో కానీ పైన దేవుడు చూస్తున్నాడు. మీరు ఎవరి ఎమోషన్స్ ని పట్టించుకోరు. జనాల్ని కింద పడేయడం కంటే అందరితో సంతోషంగా ఉంది అందరిలో సంతోషం నింపడం బాగుంటుంది. మా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అర్ధం కూడా అదే. అందుకే అది మీరు చూడాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది.
#SpreadLove and Only Love 🫶🏻 pic.twitter.com/6I1rrPXyOg
— Nayanthara✨ (@NayantharaU) November 16, 2024
దీంతో నయనతార లెటర్ తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. ధనుష్ ఫ్యాన్స్ నయనతార పై విమర్శలు చేస్తుండగా పలువురు నయనతారకు సపోర్ట్ చేస్తున్నారు.