Kubera Glimpse : ధ‌నుష్ కుబేర గ్లింప్స్ వ‌చ్చేసింది.. సింగిల్ డైలాగ్ కూడా లేదు.. మొత్తం మ్యూజిక్‌తో..

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌, కింగ్ అక్కినేని నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ కుబేర‌.

Kubera Glimpse : ధ‌నుష్ కుబేర గ్లింప్స్ వ‌చ్చేసింది.. సింగిల్ డైలాగ్ కూడా లేదు.. మొత్తం మ్యూజిక్‌తో..

Dhanush Kubera Glimpse out now

Updated On : November 15, 2024 / 5:41 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌, కింగ్ అక్కినేని నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ కుబేర‌. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ర‌మ్మ‌క మందాన క‌థానాయికగా న‌టిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్‌ కీ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ చిత్ర గ్లింప్స్‌ను సాయంత్రం 5.31కి విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. చెప్పిన‌ట్లుగానే చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది.

Aditi Govitrikar : చాన్నాళ్లకు కనిపించిన పవన్ తమ్ముడు మూవీ హీరోయిన్..

అయితే.. గ్లింప్స్‌లో క‌నీసం ఒక్క డైలాగ్ కాదు క‌దా.. సింగిల్ వ‌ర్డ్ కూడా మాట్లాడ‌లేదు. నెరిసిన గ‌డ్డంతో ధ‌నుష్ ప‌రిగెడుతుండ‌గా, టెన్ష‌న్‌గా నాగార్జున క‌నిపించారు. మొత్తంగా గ్లింప్స్ ఆక‌ట్టుకుంది.