నర్సుగా మారిన నటి.. కరోనాతో పోరాడుతున్న వారికి చికిత్స..

కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..

  • Publish Date - March 30, 2020 / 11:23 AM IST

కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..

కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. పలువురు వాలంటీర్లుగా సేవలందించడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ నటి శిఖా మల్హోత్రా వాలంటీర్‌గా మారి ముంబైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా మారి కోవిడ్-19తో పోరాతున్న వారికి చికిత్స చేస్తోంది.

శిఖా మల్హోత్రా ఎవరంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ఖాన్ నటించిన ‘ఫ్యాన్’  సినిమాలో ఓ పాత్రలో కనిపిస్తోంది. అలాగే పాపులర్ నటుడు సంజయ్ మిశ్రా నటించిన ‘Kaanchli- Life in a Slough’ (కాంచ్లీ) అనే రాజస్థానీ పిరియాడిక్ డ్రామాలో కాజ్రీ అనే క్యారెక్టర్ చేసింది. ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. అయితే తనకు తెలిసిన విద్యను కరోనా వైరస్‌తో పారాడుతున్న వారిని కాపాడేందుకు ఉపయోగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని శిఖా తెలిపింది.

Read Also : నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే.. : విరహవేదన తట్టుకోలేక పోతున్న ప్రేమికులు..

‘‘నాకు తెలిసిన విద్యను కోవిడ్-19 రోగులకు సేవ చేసేందుకు ఉపయోగిస్తాను. దేశసేవ కోసం ఎప్పుడూ నేను ముందుంటాను. అది నర్సుగా అయినా, నటిగా అయినా నాకు వీలైనంత సేవ అందిస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అందరు ఇంట్లో ఉండండి. జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వానికి తగిన సహకారం అందించండి’’ అంటూ శిఖా తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

ట్రెండింగ్ వార్తలు