Actress Shobhita committed suicide within a year of marriage
Sobhita Shivanna : కన్నడ నటి శోభిత శివన్న.. నిన్నటి నుండి ఈ నటి పేరు సోషల్ మీడియా, వార్తల్లో తెగ వినబడుతుంది. ఊహించని విధంగా ఈ నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అది చూసి షాక్ అయిన ఆమె భర్త ఏం చెయ్యాలో తెలియక తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. సడన్ గా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నటి గత సంవత్సరం ఓ ప్రైవేట్ ఉద్యోగిని వివాహం చేసుకుంది. అప్పటి నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు.
శోభిత ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఫ్లాట్ కి వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆమె అంత్యక్రియలను బెంగుళూరులో నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నటి ఆత్మహత్యకి గల కారణాలు తెలుసుకోడానికి దర్వాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన ఏడాది వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తన మరణం వెనకు భర్త హస్తం ఏమన్నా ఉందా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక కన్నడ సీరియల్ నటి శోభిత దాదాపుగా 12 సీరియల్స్ కి పైగా చేసింది. మొదట వీడియో జాకీగా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె కేవలం కన్నడలోనే కాకుండా తెలుగులో బ్రహ్మగంతు,నినిదలేతో పాటు పలు సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ తో పాటు కన్నడలో ఏటీఎం, ఒక్క కథే కెల్తా, రెండు ఒండ్ల మూడు, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వంటి సినిమాలు కూడా చేసింది. అలాగే పలు ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాతగా కూడా చేసింది. ముఖ్యంగా సీరియల్స్ లో విలన్ పాత్రల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబం తో పాటు ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.
అయితే ఆత్మహత్యకి ముందు ఈ నటి తన భర్తతో కలిసి గోవా ట్రిప్ కి కూడా వెళ్ళింది. గోవా నుంచి వచ్చి ఒకటి రెండు రోజులు అవుతుంది. ఈ వ్యవధిలోనే తను చనిపోయింది. ఆత్మహత్యకు ముందు కూడా బెంగళూరులో ఉన్న తన ఫ్యామిలీతో చాలా సేపు మాట్లాడిందట. తెల్లవారుజామున 3-4 గంటల సమయమప్పుడు ఈ ఘటన జరిగి ఉంటుందని అంటున్నారు.