టాలీవుడ్ నటి శ్రీ సుధ ఎస్సార్ నగర్ సిఐ మురళీ కృష్ణపై ఎసీబీకి ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు
కేసు విషయంలో తన వద్ద డబ్బులు వసూలు చేశారంటూ మంగళవారం ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
శ్యామ్ కే నాయుడు వ్యవహారంలో న్యాయం చేస్తానని చెప్పి మురళీ కృష్ణ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని, కేసు సాల్వ్ చేయకుండా రివర్స్ అయ్యారని, డబ్బులు తిరిగివ్వాలని, కేసు ఫైల్ చేశాక విచారణ చేయడానికి డబ్బులు ఎందుకివ్వాలని ఆమె ప్రశ్నించారు.
మురళీ కృష్ణకు, తనకూ మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్స్‌తో పాటు ఇతర ఆధారాలను ఆమె ఏసీబీ అధికారులకు అందించారు. శ్యామ్ కే నాయుడు వ్యవహారం దగ్గరి నుంచి మురళీ కృష్ణ వరకు ఏ విధంగా తనకు అన్యాయం జరిగిందనే విషయాలన్నిటినీ ఆమె కంప్లైంట్‌లో పేర్కొన్నారు.
డబ్బులు వసూలు చేసిన మురళీ కృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీ సుధ వద్ద ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ శ్రీ సుధ గతంలో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.