Sriya Reddy : పవన్ కళ్యాణ్‌పై సలార్ నటి వైరల్ కామెంట్స్..OG మూవీలో..

సలార్ నటి శ్రియారెడ్డి పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. OG లో పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ నటి పవన్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Sriya Reddy

Sriya Reddy : సలార్ సినిమాలో ‘రాధా రమ’ పాత్రలో నటించి మెప్పించారు నటి శ్రియారెడ్డి. ఈమె నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్‌తో OG లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రియా పవర్ స్టార్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sriya Reddy 1

Salaar : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సలార్‌లో ఆ పాత్ర చేసింది…

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్రకు మంచి పేరు తెచ్చింది.  వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరి ‘రాధా రమ’గా నటించిన శ్రియారెడ్డి మంచి మార్కులే కొట్టేశారు. తాజాగా ఈ నటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా OG లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రియా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకు ఆయన అంత పెద్ద స్టార్ అని తనకు తెలియదని కామెంట్ చేశారు శ్రియారెడ్డి. ఆ సినిమాలో తను నటిస్తున్నానని తెలిసాక ఎక్కడికి వెళ్లినా ‘మీరు దేవుడితో వర్క్ చేస్తున్నారు కదా’ అంటుంటే ఆయనకు జనంలో ఎంత ఆదరణ ఉందో తెలిసిందన్నారామె. ఓజీలో తాను భాగమైనందుకు, పవన్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓజీలో తన పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని ఓజీ కోసం సుజిత్ అద్భుతమైన కథ రాసారని శ్రియారెడ్డి చెప్పారు.

Salaar Affect : PVRపై సలార్ రిలీజ్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన షేర్లు

శ్రియారెడ్డి ‘అప్పుడప్పుడు’ సినిమాతో 2003 ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అమ్మ చెప్పింది, పొగరు వంటి సినిమాల్లో నటించారు. సలార్ తర్వాత ఓజీతో బిజీగా ఉన్నారు శ్రియారెడ్డి.