Tamannaah
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తన హెల్త్ గురించి ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఓ విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. తనకో ఆరోగ్య సమస్య ఉందని.. దాన్ని ఓపెన్‌గా చెప్పలేనని.. దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో తన హెల్త్ ఇష్యూ గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది తమన్నా.
Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..
‘నాకు మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా వ్యాయామం చెయ్యడం.. ఎక్కువ మొత్తంలో ఒత్తిడిని అధిగమంచే ప్రాసెస్‌లో నాకో హెల్త్ ఇష్యూ వచ్చింది. అదేంటనేది బయటకి చెప్పలేను కానీ దాని నుంచి బయట పడేందుకు నిపుణుల సూచనలు పాటిస్తున్నాను.. ఫ్రై ఫుడ్ జోలికి వెళ్లకుండా సేంద్రీయ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాను’ అన్నారు.
Tamannaah Bhatia : టైలర్‌గా మారిన తమన్నా..
అలాగే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండడానికి ద్రవపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నానని, రెగ్యులర్ మెనూలో ఆమ్లా జ్యూస్, కీరా జ్యూస్, పసుపు, బాదం పాలు, కొబ్బరినీళ్లు ఉండేలా చూసుకుంటున్నట్లు.. కెరీర్ మొదట్లో సరైన డైటీషియన్‌ను నియమించుకోకపోవడం తాను పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చింది తమన్నా..