Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..
‘సీటీమార్’ సక్సెస్ మీట్‌లో నిర్మాతలకు మిల్కీ బ్యూటీ తమన్నా సారీ చెప్పింది..
- sekhar
- Published On : September 16, 2021 / 11:46 AM IST
Tamannaah
Tamannaah: మాచో హీరో గోపిచంద్, తమన్నా జంటగా.. సంపత్ నంది డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘సీటీమార్’ రిలీజ్ పలుసార్లు పోస్ట్‌పోన్ అవుతూ.. వినాయక చవితి నాడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్లతో పాటు గోపిచంద్‌కి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.
Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..
ప్రస్తుతం రెండోవారంలోకి ఎంటర్ అయ్యింది ‘సీటీమార్’. సెకండ్ వేవ్ తర్వాత సూపర్ హిట్ అందుకున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరో గోపిచంద్, దర్శకుడు ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అయితే మిల్కీబ్యూటీ తమన్నా మాత్రం ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.
Sampath Nandi : సీటీమార్ డైరెక్టర్‌తో మెగాస్టార్..!
అయితే రీసెంట్‌గా జరిగిన ‘సీటీమార్’ సక్సెస్ మీట్‌కి అటెండ్ అయిన తమన్నా నిర్మాతలకు క్షమాపణలు చెప్పింది. ఇతర షూటింగ్స్, వ్యక్తిగత కారణాల వల్ల ‘సీటీమార్’ ప్రమోషన్స్‌లో పార్టిసిపెట్ చెయ్యడం కుదర్లేదని.. పాండమిక్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి కచ్చితంగా ప్రమోషన్స్‌కి రావాలనుకున్నా వీలుపడలేదంటూ తమన్నా సారీ చెప్పింది. ‘సీటీమార్’ లో ఆమె తెలంగాణ వుమెన్స్ కబడ్డీ టీం కోచ్ జ్వాలా రెడ్డిగా నటించింది.
We are so happy with the response evoked by #Seetimaarr ?
Thank you all, you made it happen. ?#?????????????????????@YoursGopichand @IamSampathNandi @tamannaahspeaks @SS_Screens @srinivasaaoffl @bhumikachawlat #Manisharma @adityamusic pic.twitter.com/wmVFbyncAT
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 11, 2021
