Actress Tattoos Secrets: ఇప్పుడంటే ‘పచ్చబొట్టేసినా.. పిలగాడా నిన్నే’.. అని టాటూలు చూస్తూ పాడుకుంటున్నారు కానీ పచ్చబొట్టు అనేది పదికాలాల పాటు చెరిగిపోని జ్ఞాపకం. పచ్చబొట్టే కాదు.. దానిపైన ఇష్టం కూడా చెరిగిపోలేదు. అసలు మన పూర్వీకుల్లో చాలామంది కచ్చితంగా పచ్చబొట్టు వేయించుకునేవారు.
పచ్చబొట్టు, టాటూ.. పేరు ఏదైనా అది మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. సినీ ప్రముఖులు ముఖ్యంగా హీరోయిన్లు టాటూలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. స్ఫూర్తినిచ్చే కొటేషన్లను, తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను తమ శరీరంలోని వివిధ భాగాల్లో టాటూగా వేయించుకుంటుంటారు. అలా టాటూలు వేయించుకున్న హీరోయిన్ల వివరాలు మీకోసం..
సమంత: ప్రముఖ కథానాయిక సమంతకు టాటూలంటే మక్కువ ఎక్కువ. సమంత శరీరంపై మొత్తం మూడు టాటూలున్నాయి. ఇటీవలే తన పక్కటెముకలపై భర్త‘చైతన్య’ పేరును టాటూగా వేయించుకుంది. అంతకుముందు తన చేతిపై, వీపుపై కూడా సమంత టాటూలు వేయించుకుంది.
వీరితో పాటు పాపులర్ VJ రమ్య, హాట్ బ్యూటీ షాలు షమ్మూ వంటి ముద్దుగుమ్మలు కూడా తమకిష్టమైన టాటూలు వేయించుకున్నారు.