Varshini : షాప్ ఓపెనింగ్ లో వర్షిణి.. నెయిల్ ఆర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా వర్షిణి ఒక షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది.

Varshini : షాప్ ఓపెనింగ్ లో వర్షిణి.. నెయిల్ ఆర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

Actress Varshini Interesting Comments on New Branch of Nails N Beyond Opening

Updated On : August 12, 2024 / 11:49 AM IST

Varshini Sounderajan : పలు టీవీ షోలలో యాంకర్ గా, సినిమాలు, సిరీస్ లలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది వర్షిణి సౌందరాజన్. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా వర్షిణి ఒక షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. సెలూన్ రంగంలో ఉన్న న్యాచురల్స్ అనుబంధ బ్రాండ్ నెయిల్స్ N బియాండ్ కొత్త బ్రాంచ్ ని తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ లో ప్రారంభించారు.

ఈ నెయిల్స్ N బియాండ్ కొత్త బ్రాంచ్ యాంకర్, నటి వర్షిణి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె నెయిల్స్ కి నెయిల్ ఆర్ట్ వేయించుకొని మురిసిపోయారు. అయితే ఈ కార్యక్రమంలో వర్షిణి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Varshini Sounderajan

వర్షిణి మాట్లాడుతూ.. ఇప్పుడు అమ్మాయిలు నెయిల్స్ మీద కూడా శ్రద్ద పెడుతున్నారు. నేను ఒకసారి అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి అడుక్కుంటుంది. ఆమె చేతి వేళ్ళకు కూడా నెయిల్ ఆర్ట్ ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. నాకు కూడా నా గోర్లు అంటే ఇష్టం అని తెలిపింది.