Adipurush : నేపాల్ ఖాట్మండులో ఆదిపురుష్ బ్యాన్.. ఆదిపురుష్ దెబ్బకి ఇండియన్ సినిమాలన్నీ బ్యాన్..

ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం, డైలాగ్స్ కూడా అలాగే ఉండటంతో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై నేపాల్ రాజధాని ఖాట్మండు నగర మేయర్ సినిమా రిలీజ్ రోజు స్పందిస్తూ...

Adipurush movie banned in Nepal Kathmandu and all Indian movies also banned due to adipurush

Nepal Kathmandu :  ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయినా రోజు నుంచే వివాదాల మయంగా మారిన సంగతి తెలిసిందే. ముందు నుంచి రామాయణం(Ramayanam) తీస్తున్నాం అని చెప్పి అసలు రామాయణంలోని పాత్రల స్వరూపాల్ని మార్చేసి సినిమా తీయడం, ట్రోల్స్ రావడంతో అసలు మేము రామాయణం తీయలేదు అనడం, డైలాగ్స్ పై వివాదం రావడంతో రామాయణమే ఇది డైలాగ్స్ మారుస్తాం అని చెప్పడం.. ఇలా సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఆదిపురుష్ సినిమా, చిత్రయూనిట్ వివాదంలో నిలిచారు.

అయితే ఈ వివాదం ఇక్కడ మాత్రమే కాదు వేరే దేశాల్లో కూడా వస్తుంది. ముఖ్యంగా నేపాల్ లో. నేపాల్ పూర్తి హిందూ దేశం. ముఖ్యంగా సీతాదేవి అప్పటి నేపాల్ లో జన్మించడంతో ఆమె అంటే మరింత భక్తి. ఇప్పటికి నేపాల్ లో అతిపెద్ద సీతాదేవి ఆలయం ఉంటుంది. అయితే ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం, డైలాగ్స్ కూడా అలాగే ఉండటంతో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై నేపాల్ రాజధాని ఖాట్మండు నగర మేయర్ సినిమా రిలీజ్ రోజు స్పందిస్తూ.. ఆదిపురుష్ సినిమాలో జానకిని భారతదేశ పుత్రిక అని అభివర్ణించారు. సీతామాత భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అది మార్చడానికి మూడు రోజులు గడువు ఇస్తున్నాం. ఈ లోపు మార్చకపోతే సినిమాని ఖాట్మండులో నిషేదిస్తాం అని అన్నారు.

దీనిపై చిత్రయూనిట్ స్పందించకపోవడంతో ఖాట్మండ్ మేయర్ బాలెన్ షా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సీతా జన్మించిన ప్రాంతకి సంబంధించిన అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని, లేదా మార్చాలని చిత్రయూనిట్ కి మూడు రోజుల క్రితం చెప్పాము. వాళ్ళు ఇప్పటివరకు స్పందించలేదు. నేపాల్ దేశ ఆత్మగౌరవం పరిరక్షించడం మా బాధ్యత. అందుకే ఆదిపురుష్ సినిమాని నేపాల్ ఖాట్మండులో నిషేధిస్తున్నాం. ఆ సినిమా ఒక్కటే కాదు, అందులో డైలాగ్స్ మార్చేవరకు ఏ ఇండియన్ సినిమా ఖాట్మండులో విడుదలవ్వదు. నేపాల్ రాజ్యాంగంలోని పలు సెక్షన్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నాం. నేపాల్ లోని వేరే ప్రాంతాల నాయకులతో కూడా మాట్లాడి ఆదిపురుష్ సినిమాని ఇక్కడ రద్దు చేయిస్తాం అని పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

Adipurush : ఆదిపురుష్ సెకండ్ డే కలెక్షన్స్ జోరు.. టాక్ ఎలా ఉన్నా 100 కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదు..

ఒక్క ఆదిపురుష్ దెబ్బకి ఇండియన్ సినిమాలన్నీ నేపాల్ రాజధానిలో బ్యాన్ అవ్వడం పెద్ద దెబ్బే. నేపాల్ లో అనేక హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఆడతాయి. ఖాట్మండుతో పాటు నేపాల్ లోని అన్ని నగరాలూ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే ఇండియన్ సినిమాలకు పెద్ద దెబ్బే తగులుతుంది. ఇంత జరిగినా ఇప్పటివరకు ఆదిపురుష్ చిత్రయూనిట్ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు