Adipurush : ఆదిపురుష్ స్పెషల్ ఆఫర్.. 150 రూపాయలకే 3D టికెట్.. కానీ ఆఫర్ కేవలం..

సినిమా వివాదాల్లో ఉన్నా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి మూడు రోజులు 340 కోట్ల కలెక్షన్స్ రాగా ఆ తర్వాత నుంచి మాత్రం కలెక్షన్స్ దారుణంగా తగ్గుముఖం పట్టాయి.

Adipurush special offer on 3D ticket only in Bollywood

Adipurush : ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. ముందు నుంచి రామాయణం(Ramayanam) అని ప్రమోట్ చేసి, సినిమాలో రామాయణం ఛాయలు లేకపోవడం, ట్రోల్స్ రావడంతో అసలు ఇది రామాయణం కాదని చెప్పడం, సినిమాలో వాడిన డైలాగ్స్ తో వివాదం, పలు చోట్ల సినిమాని బ్యాన్ చేయడం, సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు.. ఇలా ఆదిపురుష్ సినిమా పూర్తిగా వివాదాల్లో నిలిచింది.

సినిమా వివాదాల్లో ఉన్నా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి మూడు రోజులు 340 కోట్ల కలెక్షన్స్ రాగా ఆ తర్వాత నుంచి మాత్రం కలెక్షన్స్ దారుణంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో చిత్రయూనిట్ పఠాన్ సినిమాకు వాడిన స్ట్రేటజీ వాడటానికి రెడీ అయ్యారు. పఠాన్ 700 కోట్ల కలెక్షన్స్ తర్వాత తగ్గుముఖం పట్టడంతో అప్పట్నుంచి వారానికి ఒక ఆఫర్ పెట్టి, టికెట్ రేట్లు తగ్గించి జనాలను థియేటర్స్ కి రప్పించి మొత్తానికి 1000 కోట్ల కలెక్షన్స్ రప్పించారు. ఇప్పుడు ఆదిపురుష్ కి కూడా అదే స్ట్రేటజీ వాడుతున్నారు చిత్రయూనిట్.

తాజాగా ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. అయితే కేవలం 3D స్క్రీనింగ్ మాత్రమే 150 రూపాయలు పెట్టారు టికెట్ రేటు. ఇది కూడా కేవలం బాలీవుడ్ లో మాత్రమే పెట్టారు. సౌత్ లోని నాలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ లేదు. అలాగే విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్ని డైలాగ్స్ మారుస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మార్చిన వర్షన్ కూడా నేటి నుంచి థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ 150 రూపాయల టికెట్ రేటు కేవలం నేడు, రేపు (జూన్ 22,23) మాత్రమే ఉండనుంది. ఇలా ప్రత్యేక ఆఫర్స్ ప్రతివారం ఏదో ఒకటి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇలా టికెట్ రేట్లు తగ్గించి సినిమా చూడని ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ప్లాన్ లో ఉన్నారు. మరి ఆదిపురుష్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది.