Adipurush Telugu rights are acquired by UV Creations
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హిందూ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. డైరెక్టర్ ఓమ్ రౌత్ చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో చాలా నేర్పరి. ఆయన తీసిన లోక్ మాన్య ఏక్ యుగ్ పురుష్, తానాజీ సినిమాలు ఎంతటి విజయాల్ని అందుకున్నాయో కూడా మనకి తెలుసు.
Prabhas : కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ కి కాల్ చేసిన కృతి సనన్.. హే బాహుబలి అంటూ కరణ్ హడావిడి..
ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ కధాంశం. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సీతగా కృతి సనన్ కనిపిస్తుంది. ఇక సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ గాని టీజర్ గాని నిర్మాతలు రిలీజ్ చేయలేదు.
Maruthi Changes Plan For Prabhas: ప్రభాస్ కోసం ప్లాన్ మార్చిన మారుతి..?
కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ ”యూవీ క్రియేషన్స్” దక్కించుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ చాలా నిరాశతో ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజునైనా ఆదిపురుష్ టీం ఏమైనా అప్డేట్స్ ఇస్తుందా లేక ఎప్పటిలా అదే పోస్టర్ కు కలర్ షేడ్ మార్చి పోస్ట్ చేస్తుందో చూడాలి.