Adivi Sesh Shruti Haasan new movie titled as Dacoit
SeshEXShruti : అడివి శేష్ సినిమాలకు టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ హీరో ఒక సినిమాకి సైన్ చేశారంటే.. ఆ దర్శకుడు ఎవరు..? ఆ మూవీ కాస్టింగ్ ఏంటని..? చర్చలు ఉండవు. ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఎదురు చూపు మాత్రమే ఉంటుంది. కాగా అడివి శేష్ ఇటీవల SeshEXShruti అంటూ శ్రుతి హాసన్ తో ఓ లవ్ స్టోరీ సినిమా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ప్రముఖ యువ కెమరామెన్ షానిల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
నేడు ఆ మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘డకాయిట్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. డకాయిట్ అంటే దోపిడి దొంగ అని అర్ధం. ఈ సినిమాలో శేష్ అండ్ శృతి దొంగలుగా కనిపించబోతున్నారు. ఇక రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఒక దాడి జరిగిన ప్రాంతంలో విడిపోయిన ప్రేమికులు ఇద్దరు కలిసి ఒకర్ని ఒకరు తుపాకీలతో కాల్చుకోవడం ఇంటరెస్టింగ్ ఉంది. అసలు వీరిద్దరూ ప్రేమికుల, శత్రువులా, దొంగలా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. హిందీ, తెలుగులో ఈ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.
Also read : Dunki : దుబాయ్‌లో ‘డంకీ’ డ్రోన్ షో అదిరిపోయింది.. బుర్జ్ ఖలీఫా వద్ద షారుఖ్ సందడి..