Adivi Sesh speech at Anaganaga Success meet
సుమంత్ హీరోగా నటించిన చిత్రం అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్‌గా సుమంత్ వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమాకి నేను వచ్చాను. అప్పటి నుంచి తను నా ఫ్యామిలీనే అని అన్నారు. ఈ చిత్రంలో వాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి ఓ కారణం.. ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకు అలా ఉండటమేనని చెప్పుకొచ్చారు.
ఇక దర్శకుడు సన్నీ గురించి మాట్లాడుతూ.. ‘నా రియల్ నేమ్ కూడా సన్నీనే.. నాతో ఓ సినిమా తీస్తావా’ అని దర్శకుడిని అడివి శేష్ అడిగారు. ఇక అనగనగా సినిమాను సన్నీ చాలా బాగా తెరకెక్కించారని అభినందించారు. తాను ఈ మూవీని చూస్తున్నంత సేపు ఇది థియేటర్ చూడాల్సిన సినిమా అని అనిపించిందన్నాడు. ఈ సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదని.. ఇదొక జీవితం లాంటి చిత్రం అని శేష్ అన్నారు.
Gurthimpu : స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా.. ‘గుర్తింపు’ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఈ చిత్రంలో కాజల్ చౌదరి కథానాయికగా నటించింది. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేశ్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. చందు రవి సంగీతం అందించగా గడ్డం రాకేశ్ రెడ్డి, రుద్ర ముదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.