క్యాన్సర్ నుంచి కోలుకున్న ఇర్ఫాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాంతో ఆ నటుడు సినిమాలకి దూరమైనట్టే అని అభిమానులంతా అనుకున్నారు.

  • Publish Date - April 8, 2019 / 04:55 AM IST

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాంతో ఆ నటుడు సినిమాలకి దూరమైనట్టే అని అభిమానులంతా అనుకున్నారు.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాంతో ఆ నటుడు సినిమాలకి దూరమైనట్టే అని అభిమానులంతా అనుకున్నారు. కానీ క్యాన్సర్ వ్యాధికి జయించిన ఆ విలక్షణ నటుడు ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త ఉత్సాహంతో నటుడిగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

చికిత్స కోసం లండన్ వెళ్లిన ఇర్ఫాన్ మంగళవారం(ఏప్రిల్ 2, 2019)న ముంబై చేరుకున్నారు. దాదాపు సంవత్సరం పాటు లండన్ లో ఉన్న ఆయన… ఇప్పుడు వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించబోతున్నాడు. సినిమా సినిమాకి ఓ విలక్షణమైన పాత్రతో సహజ నటుడిగా ఆడియన్స్ లో తనదైన ముద్రవేశాడు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించాడు. అందుకే ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలియగానే ప్రేక్షకలోకం బాధలో కూరుకుపోయింది.

రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన ఇర్ఫాన్ ఫోటో గ్రాఫర్లకి హ్యాపీగా ఫోజులిచ్చాడు. త్వరలోనే ఇర్ఫాన్ హిందీ మీడియం సీక్వెల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ సినిమా పట్టాలెక్కబోతుంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన లాస్ట్ మూవీ 2018 ఆగష్టులో రిలీజైన కార్వాన్ సినిమాయే. ఆ తర్వాత లండన్ వెళ్లడంతో సినిమాలకి దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకి మేకప్ వేసుకోబోతున్నాడు.