Rajamouli : ఆ లెక్కన రాజమౌళి నెక్స్ట్ సినిమా అదే.. మహేష్ బాబు సినిమా తర్వాత..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

After Mahesh Babu Film Rajamouli Next Movie Rumors goes Viral

Rajamouli : తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసి ఆస్కార్ అవార్డు కూడా సాధించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి నుంచి రాజమౌళి స్థాయి పాన్ ఇండియా వైడ్ మారింది. RRR తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ – రాజమౌళి సినిమా రెండు షెడ్యూల్స్ షూట్ పూర్తవ్వగా నేటి నుంచి మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. మహేష్ బాబు సినిమా 2027లో రిలీజవుతుందని ఇప్పటికే టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా తీస్తాడు అనే వార్త కూడా ఇప్పుడు చర్చగా మారింది. నిన్న హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహాభారతం సినిమా ఉందని, ఆ సినిమాలో నాని కూడా ఓ పాత్ర చేస్తాడని క్లారిటీ ఇచ్చేసాడు.

Also Read : Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. YS జగన్ పేరుని ప్రస్తావిస్తూ..

దీంతో రాజమౌళి మహాభారతం మరోసారి వైరల్ గా మారింది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం సినిమానే తీస్తాడని అంటున్నారు. మహాభారతం తన డ్రీం ప్రాజెక్టు అని రాజమౌళి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇది ఒక్క సినిమాలో చూపించలేం అని కూడా చెప్పారు. ఆరు సంవత్సరాలు టైం తీసుకొని నాలుగు సినిమాలుగా మహాభారతాన్ని రాజమౌళి తీస్తాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ని కూడా తీసుకొని మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం మొదలుపెడతాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కానీ మహేష్ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ ఏంటి అని ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు కాబట్టి అంతా మహాభారతం రాజమౌళి నెక్స్ట్ సినిమా అనుకుంటున్నారు.

Also See : ఆక‌ట్టుకుంటున్న ‘నిల‌వే’ టీజ‌ర్‌

అయితే ఇటీవల ఆమిర్ ఖాన్ కూడా మహాభారతం నా డ్రీం ప్రాజెక్టు అని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టానని, ఇది కూడా పార్టులుగా వస్తుందని, ఒక్కో పార్ట్ ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడని చెప్పాడు. మరి ఆమిర్ ఖాన్ – రాజమౌళి ఎవరి మహాభారతం ముందొస్తుందో చూడాలి.