Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. అసలు నేను జగన్ ని డైరెక్ట్ గా కూడా చూడలేదు..
తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ స్కామ్ పై తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది.

Rithu Chowdary Gives Clarity on 700 Crores Land Scam
Rithu Chowdary : పలు సీరియల్స్, జబర్డస్త్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది నటి రీతూ చౌదరి. ప్రస్తుతం పలు టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలతో బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ ని అలరిస్తుంది. అప్పుడప్పుడు రీతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ తో వార్తల్లో నిలిచింది. అయితే కొన్ని రోజుల క్రితం ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఉన్నట్టు బాగా వైరల్ అయింది.
తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ స్కామ్ పై తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది.
Also Read : Rajamouli : ఆ లెక్కన రాజమౌళి నెక్స్ట్ సినిమా అదే.. మహేష్ బాబు సినిమా తర్వాత..
రీతూ చౌదరి మాట్లాడుతూ.. ఒక రోజు నేను పార్టీలో ఉంటే ఎవరో మీడియా వాళ్ళు ఫోన్ చేసి ఈ 700 కోట్ల స్కామ్ గురించి మాట్లాడితే నేను తిట్టి ఫోన్ పెట్టేసాను. నాకు అప్పుడే తెలిసిందే నా పేరు వాడుతున్నారు అని. తర్వాత ఓ రెండు రోజులు బాగా వైరల్ అయి, వీడియోలు పెట్టి, నా థంబ్ నెయిల్స్ పెట్టడంతో ఫీల్ అయ్యాను. మా చుట్టాలు, ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగారు. అసలు నా మీద ఏ కేసు లేదు. నేను అసలు జగన్ మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా డైరెక్ట్ గా కూడా చూడలేదు. అంతకు ముందు నేను డేట్ చేసిన వ్యక్తి ఈ స్కామ్ చేసాడని అన్నారు. అది కూడా నాకు తెలీదు. అతని పక్కన ఫొటోల్లో నేను ఉన్నాను కాబట్టి నా పేరు బయటకు వాడుకున్నారు.
నేను EMIలు కట్టకపోతే 700 కోట్లు ఉన్నాయిగా ఎందుకు కట్టలేదు అని అడిగారు. అసలు స్కాం జరిగిందో లేదో కూడా నాకు తెలీదు. ఒకవేళ నిజంగా నేను స్కామ్ చేస్తే ఈ పాటికి నేను జైలు లో ఉంటాను కదా. ఒక ఛానల్ వాళ్ళు నా ఎక్స్ అలా చేయించారు, నేను ఒక రూమ్ లో దొరికాను అని ఇష్టమొచ్చినట్టు న్యూస్ వేయడంతో నేను ట్రిగ్గర్ అయి ఆ ఛానల్ కి వెళ్లి ఫైర్ అయ్యాను. ఆ ఛానల్ వాళ్ళు ఫేక్ FIR క్రియేట్ చేసి, పోలీసులు నీ కోసం ఉన్నారు అని నన్ను భయపెట్టారు. ఆ ఛానల్ లో నన్ను భయపెట్టి ఇంటర్వ్యూ చేసారు. కర్మ అనేది ఉంటుంది. అది వాళ్లకు తగులుతుంది అని చెప్పుకొచ్చింది. చాన్నాళ్లకు ఈ స్కామ్ గురించి రీతూ చౌదరి క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Baahubali : టాలీవుడ్ చరిత్రని మార్చేసిన సినిమా రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?