after peddi director buchi babu sana to make a film with shah rukh khan
Buchi babu Sana: ఉప్పెన సినిమాతో తన దర్శకత్వ పటిమను టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం చేశారు బుచ్చిబాబు సనా. చాలా చిన్న అండ్ ఎమోషనల్ పాయింట్ ని తీసుకొని రెండుగంటల పాటు చాలా ఎంగేజింగ్ గా చూపించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో(Buchi babu Sana) ఏకంగా స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Raashi Khanna: గ్లామరస్ తో కిక్కిస్తున్న రాశి ఖన్నా.. ఫోటోలు
ఇక ఈ సినిమా తరువాత కూడా మరో భారీ ప్రాజెక్టుపై కన్నేశాడు దర్శకుడు బుచ్చిబాబు. గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే తమిళ్ లో గుడ్ బ్యాగ్ అగ్లీ, హిందీలో జాట్ సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ హీరో మరెవరో కాదు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అవును, ఈ మధ్యే షారుఖ్ ను కలిసి తన నెక్స్ట్ సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారట మైత్రి మూవీ మేకర్స్.
దాదాపు రూ.500 కోట్లతో తెరకెక్కనున్న ఈ సినిమా చేసే అవకాశం బుచ్చిబాబుపై పెట్టారట మైత్రి సంస్థ. ఉప్పెన, ఇప్పుడు పెద్ది సినిమాలకు కూడా మైత్రి సంస్థ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాలను బుచ్చిబాబు తెరకెక్కించిన విధానానికి ఫిదా అయ్యారట. అలాంటి దర్శకుడు అయితేనే షారుఖ్ సినిమాకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని ఆ క్రేజీ ప్రాజెక్టును అయన చేతిలోపెట్టాడట. ఇప్పటికే కథ చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే షారుఖ్ సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. మరి మూడో సినిమానే షారుఖ్ లాంటి స్టార్ తో చేయడం అంటే మాములు విషయం కాదు. ఎలా డీల్ చేస్తాడో చూడాలి.