BoycottLaila : 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్.. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్… రంగంలోకి హీరో

విశ్వ‌సేన్ న‌టిస్తున్న లైలా మూవీకి స‌రికొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

After Prudhvi Raj comments viral BoycottLaila trends on social media

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌రు అయ్యారు. చిరంజీవి మాట్లాడిన మాట‌లు హైలెట్‌గా నిలిచాయి. అదే స‌మ‌యంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన వ్యాఖ్య‌లు వివాదానికి తెర‌లేపాయి.

ఈ చిత్రంలో త‌న పాత్ర గురించి చెబుతూ ఆయ‌న మాట్లాడిన మాట‌లు ప్ర‌స్తుతం చిత్ర బృందానికి స‌రికొత్త టెన్ష‌న్ ను తెచ్చిపెట్టాయి. ఈవెంట్‌లో పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. లైలా సినిమాలో త‌న‌కు అవ‌కాశం రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నాడు. మేక‌ల స‌త్యం అనే క్యారెక్ట‌ర్‌లో తాను న‌టించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

Thandel : దారుణం.. APSRTC బ‌స్‌లో తండేల్ సినిమా.. ఇంత అవమానిస్తారా..? బన్నీవాసు ఫుల్ సీరియస్

మేక‌ల స‌త్యం క్యారెక్ట‌ర్ సీన్ షూటింగ్ చేసేట‌ప్పుడు యాదృచ్ఛికంగా ఓ ఘ‌ట‌న‌ జ‌రిగింది. మొద‌ట షూటింగ్ ప్రారంభంలో 150 మేక‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ‘ఓ సీన్లో నన్ను కట్టిపడేస్తారు. నా బామ్మర్దుల రాగానే నన్ను వదిలేస్తారు. ఆ తర్వాత మేక‌ల్ని లెక్క పెడితే సరిగ్గా 11 ఉన్నాయి. ఏంటో మాకు అలా కలిసి వచ్చింది.’ అని చెప్పారు. ఆయ‌న మాట్లాడిన ఈ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇన్‌డైరెక్ట్‌గా త‌మ పార్టీ గురించే పృథ్వీ కామెంట్లు చేశాడ‌ని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో లైలా చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో Boycott Laila ట్రెండింగ్ అవుతోంది.

Thandel Collections : బాక్సాఫీస్ వద్ద‌ నాగ‌చైత‌న్య ‘తండేల్’ జోరు.. మూడు రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

రంగంలోకి విశ్వ‌క్‌సేన్‌..

న‌టుడు పృథ్వీ మాట్లాడిన మాట‌లు సినిమాకు తీవ్ర న‌ష్టం క‌లిగించే అవ‌కాశం ఉంది. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్ లో ఉండ‌డంతో చిత్ర బృందం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మీడియా స‌మావేశం పెట్టి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్న‌ట్లుగా స‌మాచారం.