Thandel Collections : బాక్సాఫీస్ వద్ద‌ నాగ‌చైత‌న్య ‘తండేల్’ జోరు.. మూడు రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

నాగ‌చైత‌న్య న‌టించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న హ‌వాను కొన‌సాగిస్తోంది.

Thandel Collections : బాక్సాఫీస్ వద్ద‌ నాగ‌చైత‌న్య ‘తండేల్’ జోరు.. మూడు రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

Naga Chaitanya Thandel three days Collections details here

Updated On : February 10, 2025 / 10:21 AM IST

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన చిత్రం తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక న‌టించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ల‌వ్‌, యాక్ష‌న్‌, దేశ‌భ‌క్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాటిజివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

విడుద‌లైన మూడు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.62.37 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మార‌గా.. అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక చిత్ర బృందం స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Chiranjeevi : నాటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేనగా రూపాంతరం చెందింది- చిరంజీవి హాట్ కామెంట్స్

కాగా.. ఈ చిత్రం తొలి రోజు రూ.21.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్‌లో మొద‌టి రోజు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Salman Khan : స‌ల్మాన్ ఖాన్ రోజుకు ఎన్ని గంట‌లు ప‌డుకుంటాడో తెలుసా?

అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని జాల‌ర్ల‌ జీవితంలో జ‌రిగిన యదార్థ గాధ ఆధారంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య నటనకు ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారు. ఎమోషనల్ సీన్లలో అయితే.. చైతూ ఏడిపించేశాడని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.