Naga Chaitanya Thandel three days Collections details here
అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సాయి పల్లవి కథానాయిక నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాటిజివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ పోస్టర్ వైరల్‌గా మారగా.. అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక చిత్ర బృందం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Chiranjeevi : నాటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేనగా రూపాంతరం చెందింది- చిరంజీవి హాట్ కామెంట్స్
The ‘BLOCKBUSTER LOVE TSUNAMI’ collects MASSIVE 𝟔𝟐.𝟑𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒+ 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in 3 days ❤️🔥🌊⚓
Fastest ‘𝟔𝟎𝐜𝐫+ 𝐠𝐫𝐨𝐬𝐬𝐞𝐫’ for Yuvasamrat @chay_akkineni 🔥🤩
Book your tickets for BLOCKBUSTER #Thandel now!
🎟️ https://t.co/5Tlp0WNszJ… pic.twitter.com/rZlRQHYezo— Thandel (@ThandelTheMovie) February 10, 2025
కాగా.. ఈ చిత్రం తొలి రోజు రూ.21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
Salman Khan : సల్మాన్ ఖాన్ రోజుకు ఎన్ని గంటలు పడుకుంటాడో తెలుసా?
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారు. ఎమోషనల్ సీన్లలో అయితే.. చైతూ ఏడిపించేశాడని అందరూ మెచ్చుకుంటున్నారు.