After RRR, Baahubali, Dhamaka achieved that record
Dhamaka : మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇచ్చాడు. హీరోయిన్ గా నటించిన శ్రీలీల తన నటనతో, డాన్సులతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. కాగా ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డుని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
Dhamaka: వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోన్న మాస్ రాజా ‘ధమాకా’!
రాజమౌళి తెరకెక్కించిన RRR, బాహుబలి 1&2, చిత్రాలు సాధించిన రికార్డు.. రవితేజ ధమాకా కూడా అందుకొని ఆ తరువాతి స్థానంలో నిలిచింది. అదేంటంటే ధమాకా సినిమా 10వ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఆంధ్ర అండ్ తెలంగాణలో బాక్స్ ఆఫీస్ వద్ద 10వ రోజు హైయెస్ట్ షేర్ రాబట్టిన సినిమాల జాబితాలో ధమాకా.. రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమాల తరువాత నాలుగో స్థానంలో నిలిచి రవితేజ ధమాకా ఏంటో తెలియజేసింది.
కాగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.94 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రేపటితో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో భారీ పరాజయాన్ని అందుకున్న రవితేజ.. ధమాకాతో ఈ రేంజ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు రవితేజ ఫ్యాన్స్. ప్రస్తుతం రవితేజ, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక పవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive Day 1️⃣0️⃣ Rampage ?#DhamakaBlockBuster in Cinemas Now ??#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/czAPi0Xk6F
— People Media Factory (@peoplemediafcy) January 2, 2023