After The Raja Saab Prabhas doing another film with director Maruthi.
Prabhas: ది రాజాసాబ్ సినిమాతో భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ దారుణంగా రిజెక్ట్ చేశారు. కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది ఈ సినిమా. నిజానికి మాస్ చిత్రాల మూస నుంచి బయటకు వచ్చి దర్శకుడు మారుతీ మీద ఉన్న నమ్మకంతో చాలా జెన్యూన్ గా రాజాసాబ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్(Prabhas).
అది కూడా కెరీర్ పీక్ టైంలో. కానీ, రొటీన్ కథ, కథనాలతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు మారుతీ. అందుకే, రాజసాబ్ సినిమా విడుదల తరువాత దర్శకుడు మారుతీ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ 3 ఇయర్స్ టైం వేస్ట్ చేశావంటూ మారుతీని ఒక ఆట ఆడేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వింటేజ్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేస్తావని నమ్మకం పెట్టుకున్నందుకు దెబ్బేశావ్ అంటూ ట్రోల్ చేశారు. ఇంకా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేశారు మేకర్స్.
Thiruveer: డబ్బులు ఇస్తేనే ఇంటర్వూస్.. నేను మోసపోతూనే ఉన్నాను.. హీరో తిరువీర్ షాకింగ్ కామెంట్స్
ఆ విషయంలో కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే, ఇంకా రాజసాబ్ సినిమా షాక్ నుంచి కోలుకోకముందే ప్రభాస్ తన ఫ్యాన్స్ కి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట. అదేంటంటే. దర్శకుడు మారుతీతో మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అవును, అది కూడా రాజాసాబ్ సినిమా విడుదల కాకముందే. ఈ సినిమాను ప్రభాస్ తో సలార్ సినిమా చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నిర్మించనున్నారట.
త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక రాజాసాబ్ నుంచి కోలుకోకముందే మళ్ళీ షాక్ ఇస్తున్నావ్ ప్రభాస్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా అవసరమా అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.