AGADHA : ఆక‌ట్టుకుంటున్న అగ‌ధ ట్రైల‌ర్‌.. మంత్ర తంత్ర విద్య‌ల‌కు అంద‌ని శ‌క్తి

కామాక్షి భాస్క‌ర్ల‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం అగ‌ధ‌ (AGADHA).

AGADHA Official Trailer out now

AGADHA : కామాక్షి భాస్క‌ర్ల‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం అగ‌ధ‌. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Khyaathika : జ‌బ‌ర్ద‌స్త్ రాకేష్, జోర్దార్ సుజాతల కూతురు.. ఖ్యాతిక బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు..

మంత్ర తంత్ర విద్య‌ల‌కు అంద‌ని శ‌క్తి ఉంది. దాని గురించి నాకు తెలియాలి అని కామాక్షి భాస్క‌ర్ల చెప్పే డైలాగ్ అదిరిపోయింది.