Aha OTT : యువ రచయితలకు ఆహా ఓటీటీ ఆహ్వానం.. మీ దగ్గర ట్యాలెంట్ ఉంటే ట్రై చేయండి..

ఆహా కంటెంట్ తెచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు కొత్త రచయితలకు, డైరెక్టర్స్ కు ఆహ్వానం పలుకుతుంది.

Aha OTT Welcomes New Writers in Various Genre Details Here

Aha OTT : తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో అలరిస్తుంది. రెగ్యులర్ గా కొత్త కంటెంట్ ను తీసుకొస్తుంది. అయితే ఆహా కంటెంట్ తెచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు కొత్త రచయితలకు, డైరెక్టర్స్ కు ఆహ్వానం పలుకుతుంది. తాజాగా నేడు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అలాగే కొత్త రచయితకు ఆహ్వానం అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ఈ థియేటర్స్‌లో చూసేయండి.. దేశవ్యాప్తంగా 11 థియేటర్స్ లిస్ట్..

ఆహా ఓటీటీ నిర్మాత SKN మాస్ మూవీ మేకర్స్ బ్యానర్, డైరెక్టర్ సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్స్ తో కలిసి ట్యాలెంట్ హంట్ ఏర్పాటు చేసింది. సరికొత్త కథలు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్ర, రొమాన్స్, యాక్షన్ జానర్స్ లో రచయితలు కావాలని ప్రకటిస్తూ ఓ లింక్ ఇచ్చింది. ఆహా ఓటీటీ ఇచ్చిన లింక్ లోకి వెళ్లి వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ కు సీన్స్ రాసి సబ్మిట్ చేస్తే వాళ్లకు నచ్చితే పిలిచి రచయితలుగా అవకాశం ఇస్తారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు రచయితలైతే ఆహా ఓటీటీ ఇచ్చిన https://www.aha.video/talenthunt ఈ లింక్ లో అప్లై చేయండి.