Aha Qubool Hai: పాత బస్తీ బాల్య వివాహాల కథతో క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కుబూల్ హై?’
హైదరాబాద్ పాత బస్తీలో అరబ్ షేక్ లకు బాలికలతో వివాహాలు చేస్తారని.. ఒకవిధంగా బాల్య వివాహాల ద్వారా అరబ్ షేక్ లు బాలికలతో వ్యాపారం చేస్తారని మనం చాలా సార్లు విన్నాం. అప్పుడప్పుడు..
- Naresh Mannam
- Published On : March 2, 2022 / 09:04 PM IST
Aha Qubool Hai
Aha Qubool Hai: హైదరాబాద్ పాత బస్తీలో అరబ్ షేక్ లకు బాలికలతో వివాహాలు చేస్తారని.. ఒకవిధంగా బాల్య వివాహాల ద్వారా అరబ్ షేక్ లు బాలికలతో వ్యాపారం చేస్తారని మనం చాలా సార్లు విన్నాం. అప్పుడప్పుడు న్యూస్ ఛానెళ్లలో కూడా యదార్ధ ఘటనలను కూడా చూశాం. అయితే ఇప్పుడు అలాంటి కథకు క్రైమ్ థ్రిల్లర్ జోడించి తెరకెక్కిన వెబ్ సిరీస్ కుబుల్ హై. అచ్చ తెలుగు ఆహా ఓటీటీ నుండి రాబోతున్న మరో ఒరిజినల్ కంటెంట్ కుబుల్ హై.
Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!
తాజాగా విడుదలైన టీజర్ చూస్తే ఇది హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో బాల్య వివాహాలు-అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంగా తెలుస్తుండగా.. దానికి క్రైమ్, కాస్త బోల్డ్ కూడా జత చేశారు. ఓ చిన్నారి పెళ్లికూతురు పడుతున్న బాధలతో హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ను ఆహా తెరపైకి తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఆహా సమర్పణలో పింగిల్ ప్రణవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ఆయనే సహ దర్శకత్వం వహిస్తున్నాడు.
OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్
టీజర్ లో కనిపించిన వారిలో మనోజ్ ముత్యం-వినయ్ వర్మ తెలిసిన వారే కాగా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళుగా కనిపిస్తుంది. ఖుబూల్ హై చిత్రానికి కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ అందించగా.. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ అందించిన నేపథ్యసంగీతం టీజర్ లోనే హైలెట్ గా నిలిచింది. మార్చి 11న ఆహా వీడియోలో ప్రీమియర్ కానున్న సిరీస్ చూస్తే కానీ.. మిగతా టెక్నీకల్ వాల్యూస్ తో పాటు బోల్డ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లో ఎలాంటి నిజాలు చూపిస్తారు.. ఎలాంటి అంశాలు తెరమీదకి తెస్తారన్నది తెలియదు.
