Aiashwarya Rai shares her best experience from Ponniyin Selvan Sets
Aiashwarya Rai : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేసింది.
ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ.. ”నా కూతురు ఆరాధ్య ఒకసారి పొన్నియిన్ సెల్వన్ సెట్స్‌కి వచ్చింది. ఒక పీరియాడికల్ డ్రామా షూట్ మొదటి సారి చూడడంతో ఆరాధ్య చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. మణిరత్నం సర్ ఆరాధ్యని పిలిచి మరీ ఓ సీన్ కి కట్ చెప్పే అవకాశం ఇచ్చారు. దీంతో సెట్ లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు అలాంటి అవకాశం మాకు కూడా రాలేదు. కానీ ఆరాధ్యకి దక్కింది. నాకు, నా కూతురికి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగులుతుంది. మణిరత్నం సర్ వల్లే నా కూతురికి అంత గొప్ప అవకాశం వచ్చింది” అని తెలిపింది.