Site icon 10TV Telugu

Lal Salaam : 21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది.. ‘లాల్ సలామ్’ అందుకే ప్లాప్.. ఐశ్వర్య రజినీకాంత్

Aishwarya Rajinikanth said they lost 21days footage of Lal Salaam

Aishwarya Rajinikanth said they lost 21days footage of Lal Salaam

Lal Salaam : ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజినీకాంత్ ముఖ్య పాత్రలో, కపిల్ దేవ్ గెస్ట్ రోల్ లో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘లాల్ స‌లామ్‌’. భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్స్ లో ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది.

అంతేకాదు ఐశ్వర్య రజినీకాంత్ కి ఎన్నో విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. ఈ మూవీ రిజల్ట్ గురించి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఐశ్వర్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గొంతు విప్పారు. “సినిమాలో ముఖ్యమైన ఫుటేజ్‌ అయినా క్రికెట్ మ్యాచ్ సీన్స్ పోయాయి. నిజమైన క్రికెట్ మ్యాచ్ లా చూపించేందుకు పది కెమెరాల సెటప్ తో దాదాపు 21 రోజుల షూటింగ్ చేసాము. కానీ ఆ ఫుటేజ్‌ అంతా పోయింది” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Rajamouli : మలయాళ నటులు గొప్ప యాక్టర్స్.. అందుకు బాధపడుతున్నా అంటున్న రాజమౌళి..

21 రోజుల షూటింగ్ ఫుటేజ్ పోవడంతో.. ఏం చేయాలో అర్ధం కాలేదని, మళ్ళీ రీ షూట్ చేయడానికి కూడా వీలులేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. దీంతో ఉన్న ఫుటేజ్ తోనే సినిమాని ఎడిట్ చేసినట్లు వెల్లడించారు. ఇక అలాగే సినిమా పై వచ్చిన విమర్శలను కూడా తాను ఫీడ్ బ్యాక్ గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. సినిమా ఎటువంటి ట్విస్ట్ లు లేకుండా ఫ్లాట్‌గా, సింపుల్‌గా తీసుకు వెళ్ళాము. అయితే ఇప్పటి ఆడియన్స్.. కథలో మలుపులు కోరుకుంటున్నారు అని అర్థమైందని చెప్పుకొచ్చారు.

కాగా 90 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్లు కూడా రాబట్టలేక డీలా పడింది. రజిని నటించిన ‘జైలర్’ ఈ ప్రొడక్షన్ కంపెనీలోనే రూపొంది భారీ లాభాలు తెచ్చిపెడితే.. ఈ సినిమా మాత్రం భారీ నష్టాలు తీసుకొచ్చింది.

Exit mobile version