Ajay Bhupathi : మంగళవారం సినిమాటిక్ యూనివర్స్.. ప్రామిస్ చేస్తున్నా.. పార్ట్ 2 పై అజయ్ భూపతి కామెంట్స్..
ఈ క్రమంలో మంగళవారం పార్ట్ 2 గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Ajay Bhupathi)
- Saketh U
- Published on- July 29, 2026 / 01:47 PM IST
Ajay Bhupathi
Ajay Bhupathi : డైరెక్టర్ అజయ్ భూపతి RX100 తర్వాత మంగళవారం సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి రా & రస్టిక్ గా బోలెడన్ని ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కంటెంట్ కి అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఎండింగ్ లోనే పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. అయితే మంగళవారం తర్వాత ఆ సినిమాకు పార్ట్ 2 చేస్తారు అనుకుంటే శ్రీనివాస మంగాపురం సినిమా చేసారు.
మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా జులై 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అజయ్ భూపతి నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం పార్ట్ 2 గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Trisha Krishnan : ఆస్ట్రేలియా నుంచి ఫొటోలు షేర్ చేసిన త్రిష..
అజయ్ భూపతి మాట్లాడుతూ.. మనవాళ్ళు మంగళవారం సినిమా గురించి ఎంత మాట్లాడారో తెలీదు కానీ తమిళ్, మలయాళం ఆడియన్స్ చాలా పొగిడారు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ అన్నారు. లేడీస్ నుంచి కూడా ఆ సినిమాకు అభినందనలు వచ్చాయి. మంగళవారం సినిమాకు నేనే నిర్మాత కాబట్టి ఈ సినిమా తర్వాత చేద్దాంలే అనుకున్నా. మంగళవారం 2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను కానీ ప్రామిస్ చేస్తాను. ఆ సినిమాలో పెట్టే పాత్రలు, ఎలిమెంట్స్, మేకింగ్ స్టైల్, సీన్స్ అన్నిటికి షాక్ అవుతారు.
ఆడియన్స్ కేవలం హీరోని చూసి మాత్రమే సినిమాకు రారు. కథ కోసం కూడా వస్తారు. మంగళవారం సినిమాకు కూడా హీరో, హీరోయిన్స్ అవసర్లేదు. ఆ సినిమా పేరు ఉంటే చాలు. పార్ట్ 2లో కూడా కొత్తగా ఎంటర్ అయ్యే పాత్రలు ఉంటాయి, సీక్రెట్ పాత్రలు ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయి. సినిమాటిక్ యూనివర్స్ అని కాదు కానీ చాలా కొత్త పాత్రలు వస్తాయి. నేను మంగళవారం సినిమాలోనే పార్ట్ 2కి హింట్ ఇచ్చా. దాని గురించి ముందే అనుకున్నాను. ఇది హై టెక్నికల్ సినిమా. ఆ సంవత్సరం మంగళవారం సినిమా తెలుగు నుంచి ఆస్కార్ లిస్ట్ కి కూడా వెళ్ళింది. పార్ట్ 2 కూడా అదే క్వాలిటీతో చేస్తాను అని అన్నారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఇప్పట్నుంచే నెలకొన్నాయి.
