Ajay Bhupathi : ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన ‘ఆర్‌ఎక్స్ 100’ డైరెక్టర్
అజయ్ భూపతి తన మొదటి సినిమా 'ఆర్‌ఎక్స్ 100'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ వెయిట్ చేశారు. అయితే '
- Saketh U
- Published On : October 29, 2021 / 09:28 AM IST
Ajay
Ajay Bhupathi : అజయ్ భూపతి తన మొదటి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ వెయిట్ చేశారు. అయితే ‘ఆర్‌ఎక్స్ 100’ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇటీవలే ‘మహా సముద్రం’ సినిమాతో మన ముందుకి వచ్చాడు. శర్వానంద్, సిద్దార్థ్ లను హీరోలు గా పెట్టి మల్టీస్టారర్ సినిమా తీసాడు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. జగపతి బాబు, రావు రమేష్, కెజిఎఫ్ గరుడలు స్పెషల్ పాత్రల్లో నటించారు. ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తీశామని ప్రమోట్ చేశారు.
Nagarjuna : ఏపీ సీఎం జగన్ ని కలిసిన నాగార్జున
ఈ సినిమాని భారీగా ప్రమోషన్ చేశారు. సిద్దార్థ్ చాలా రోజుల తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడం, అది కూడా మాస్ రోల్ లో చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా టీజర్, ట్రైలర్ లు చూసి సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అని అందరూ ఆశించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, సినిమా ఫంక్షన్స్ లో కూడా డైరెక్టర్ తో సహా చిత్ర బృందం అంతా సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా మాట్లాడారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. చిత్ర బృందం హైప్ ఇచ్చినంత రేంజ్ లో సినిమా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.’ఆర్‌ఎక్స్ 100′ లెవెల్ లో ఈ సినిమా లేదని తేల్చి చెప్పేసారు. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్ భూపతికి తెలిపారు.
Shanmukh Jaswanth : షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నా పని అయిపోయింది అన్న షన్ను
తాజాగా పవన్‌రెడ్డి అనే ఓ ట్విట్టర్ యూజర్ మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్? చాలా ఎక్స్‌పెక్ట్ చేశా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి.. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్ టైం మంచి కథతో వస్తాను అని తెలిపాడు. ఇలా అజయ్ భూపతి క్షమాపణలు చెప్పిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sorry for not reaching your expectations… Next time I will be back with a story that can satisfy you all… https://t.co/RTWin30gKV
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021
