Shanmukh Jaswanth : షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నా పని అయిపోయింది అన్న షన్ను

మొదటి నుంచి షన్ను, సిరి కలిసి గేమ్ ఆడుతున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నారు. మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారు. వీళ్లిద్దరు బిగ్ బాస్ కి రాకముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవడం

Shanmukh Jaswanth : షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నా పని అయిపోయింది అన్న షన్ను

Shannu Siri

Shanmukh Jaswanth :  బిగ్ బాస్ లో గొడవలతో పాటు అప్పుడప్పుడు ఎమోషనల్స్, సెంటిమెంట్స్ , లవ్ ట్రాక్స్, ఫ్రెండ్షిప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ తక్కువే ఉన్నాయి. ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సభ్యులంతా ఫ్రెండ్స్ అంటూ గ్రూపులుగా విడిపోయారు. ఈ సారి ఫ్రెండ్స్ అంటూనే హాగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. నిన్నటి దాకా కెప్టెన్సీ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. మొదటి సారి షన్ను కెప్టెన్ అయ్యాడు.

Bigg Boss 5 : ఎట్టకేలకు కెప్టెన్ అయిన షన్ను.. ఆనందంలో అభిమానులు

మొదటి నుంచి షన్ను, సిరి కలిసి గేమ్ ఆడుతున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నారు. మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారు. వీళ్లిద్దరు బిగ్ బాస్ కి రాకముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవడంతో ప్రేక్జ్షకులు కూడా వీళ్లిద్దరి స్నేహ బంధాన్ని అర్ధం చేసుకొని ఆనందిస్తున్నారు. తాజాగా సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం. షన్ను సిరిని ఉద్దేశించి.. మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం అని అన్నాడు. దీంతో సిరి నేను బాగానే ఉన్నారా. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని చెప్పడంతో వెంటనే అయితే నన్ను దూరం పెట్టు అని షన్ను కొంచెం సీరియస్ గానే అన్నాడు. దీంతో సిరి కాసేపు సైలెంట్ అయిపొయింది.

Sports Movies : ఆటే కథ.. ఆటే సినిమా.. గేమ్స్ తో బాక్సాఫీస్ లో గోల్ కొడుతున్నారు

ఆ తర్వాత షన్నునే సిరితో అరె ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్‌ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. దీంతో షన్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’ అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడాడు. అలాగే కెమెరా వైపు చూసి అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది, నా పని అయిపొయింది అంటూ ఫన్నీగా అన్నాడు. సిరి ముద్దు పెట్టి వెళ్లిపోయే సీన్ కి బిగ్ బాస్ సాంగ్ యాడ్ చేసి కొంచెం రొమాంటిక్ గా టెలికాస్ట్ చేయడం విశేషం.