Nysa Devgan : హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న మరో బాలీవుడ్ స్టార్ కిడ్..??
తాజాగా మరో స్టార్ కిడ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. అజయ్ దేవగన్, కాజోల్ ల కూతురు నైస దేవగన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు..............

Ajay Devgan Daughter Nysa Devgan will entry in bollywood as heroine
Nysa Devgan : సినీ వారసత్వం కొత్తేమి కాదు. అన్ని సినీ పరిశ్రమలోనూ హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు.. ఇలా అందరూ తమ వారసులని కూడా సినిమాల్లోకి తీసుకొస్తారు. ఇక బాలీవుడ్ లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తమ కొడుకులని, కూతుర్లని హీరో హీరోయిన్స్ గా తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్.. లాంటి చాలా మంది స్టార్ కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా మరో స్టార్ కిడ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. అజయ్ దేవగన్, కాజోల్ ల కూతురు నైస దేవగన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఇటీవలే వచ్చిన నైస ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా నుంచి రాగానే బాలీవుడ్ పార్టీలకి వరుసగా హాజరవుతుంది. మిగిలిన స్టార్ కిడ్స్ తో తిరుగుతూ ఫోటోలు దిగుతూ రచ్చ చేస్తుంది. పార్టీల్లో వేసే డ్రెస్సులతో కూడా తను హీరోయిన్ మెటీరియల్ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. బాలీవుడ్ మీడియా నైస దేవగన్ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అంటున్నారు. మరి దీనిపై అజయ్ దేవగన్, కాజల్, నైస కానీ స్పందించలేదు.