అజిత్ నటిస్తున్న పింక్ తమిళ్ రీమేక్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానుంది.
తమిళ తల అజిత్ లేటెస్ట్ సెన్షేషన్ విశ్వాసం, కోలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతుంది. పొంగల్ స్పెషల్‌గా జనవరి 10న రిలీజ్ అయిన విశ్వాసం.. 3 వ వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. ఇప్పటికే తమిళనాట ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. దీని తర్వాత అజిత్, బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలందుకున్న పింక్, తమిళ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. అజిత్‌కిది 59వ సినిమా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ తదితరులు నటించిన పింక్ తమిళ్ రీమేక్‌కి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలిసాయి. అమితాబ్ పాత్రలో అజిత్, ఆయనకి జోడీగా విద్యా బాలన్, తాప్సీ క్యారెక్టర్‌లో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా, ఆండ్రియా తరియంగ్, సుజిత్ శంకర్, అధిక్ రవి, అశ్విన్ రావు, అర్జున్ చిదంబరం ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.
ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం తమిళ నేటివిటీకి తగ్గట్టు స్ర్కిప్ట్‌లో మార్పులు చేస్తున్నారు. స్వర్గీయ శ్రీదేవి భర్త, బోనీ కపూర్ నిర్మిస్తుండగా, ఖాకీ ఫేమ్.. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం : యువన్, కెమెరా : నిరవ్ షా, ఎడిటింగ్ : గోకుల్ చంద్రన్, ఆర్ట్ : కె కథీర్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్.
వాచ్ విశ్వాసం ట్రైలర్…