Ajith Kumar Trisha VidaaMuyarchi Trailer Released
VidaaMuyarchi Trailer : తమిళ్ స్టార్ హీరో అజిత్‌కుమార్, త్రిష జంటగా తెరకెక్కుతున్న సినిమా విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అర్జున్, రెజీనా, ఆరవ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. గతంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా విడాముయర్చి సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా తెలుగులో కూడా విడాముయర్చి టైటిల్ తోనే ప్రమోట్ చేస్తున్నారు. కానీ తాజాగా దీనికి పట్టుదల అనే తెలుగు టైటిల్ ప్రకటించారు. మీరు కూడా అజిత్ విడాముయర్చి తెలుగు ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ ట్రైలర్ లో.. అజిత్, త్రిష ప్రేమని చూపించి అనంతరం వీళ్లకు ఒక సమస్య రాగా అజిత్ ఎలా పోరాడాడు అన్నట్టు యాక్షన్ గా చూపించారు. ఈ విడాముయర్చి సినిమా ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని ఫిబ్రవరి 6న తమిళ్, తెలుగులో రిలీజ్ చేయనున్నట్టు ట్రైలర్ తో పాటు అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.