Gossip Garage Akhanda 2 likely to avoid clash with OG
నందమూరి బాలకృష్ణ తన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ అఖండ-2 రిలీజ్‌ను వాయిదా వేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీని పవన్ కళ్యాణ్ కోసం పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నారట బాలయ్య. అదే సెప్టెంబర్ 25రోజున పవన్ కళ్యాణ్ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రెండు పెద్ద సినిమాల క్లాష్ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.
ఈ క్లాష్ రాకుండా బాలయ్య తన అఖండ-2 రిలీజ్‌ను దసరాకు, అంటే అక్టోబర్ 2న విడదల చేయాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్, బజ్..బాలయ్య నిర్ణయానికి కారణమని ఇండస్ట్రీ వర్గాల టాక్.
DNA : తమిళ్ సూపర్ హిట్ సినిమా.. త్వరలో తెలుగులో రిలీజ్..
డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌లో హైప్‌ను పెంచాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఫ్రీరన్ ఇవ్వడానికి బాలయ్య ఈ త్యాగానికి సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలయ్య, పవన్ కల్యాణ్ ఇద్దరూ టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్. పైగా ఒకరు డిప్యూటీ సీఎం. ఇంకొకరు ఎమ్మెల్యే. బాలయ్య నిర్ణయం వెనుక వారి మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్. అఖండ-2 లాంటి పెద్ద సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం అంటే చిన్న విషయం కాదు.
కానీ చాలా రోజుల తర్వాత వస్తోన్న పవన్ సినిమాకు ఏ కాంపిటీషన్ ఉండొద్దనే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే అఖండ-2 రిలీజ్ పోస్ట్‌పోన్‌పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటనేమి రాలేదు. ఇప్పటికే బాలయ్యది గొప్ప మనసు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అఖండ-2 రిలీజ్ నిజంగానే వాయిదా పడుతుందా.? లేదా అనేది వేచి చూడాలి.