DNA : తమిళ్ సూపర్ హిట్ సినిమా.. త్వరలో తెలుగులో రిలీజ్..

ఇటీవల తమిళంలో రిలీజయి సూపర్ హిట్ అయిన DNA సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.

DNA : తమిళ్ సూపర్ హిట్ సినిమా.. త్వరలో తెలుగులో రిలీజ్..

dna

Updated On : July 4, 2025 / 8:31 PM IST

DNA : ఇటీవల తమిళంలో రిలీజయి సూపర్ హిట్ అయిన DNA సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. SK పిక్చర్స్ బ్యానర్ ద్వారా సురేష్ కొండేటి తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఒలంపియా మూవీస్ బ్యానర్ పై నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో అధర్వ మురళి, నిమిషా సజయన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా DNA. ఇటీవలే జూన్ 20న తమిళ్ లో రిలీజయి మంచి విజయం సాధించింది.

ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘మై బేబీ’ అనే టైటిల్ తో జులై 11న విడుదల కానుంది. హాస్పిటల్స్ లో పిల్లలు మాయమయ్యే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. 2014 లో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు.

Also Read : Show Time : ‘షో టైం’ మూవీ రివ్యూ..

గతంలో ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా.. లాంటి సూపర్ హిట్ తమిళ్ సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి పెద్ద హిట్స్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ కాస్త గ్యాప్ తర్వాత సురేష్ కొండేటి మై బేబీ సినిమాతో రాబోతున్నారు.

DNA