Show Time : ‘షో టైం’ మూవీ రివ్యూ..

'షో టైం' సినిమా కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఒక రోజులో జరిగే కథ.

Show Time : ‘షో టైం’ మూవీ రివ్యూ..

Naveen Chandra Kamakshi Bhaskarla

Updated On : July 4, 2025 / 7:38 PM IST

Show Time Movie Review : అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మాణంలో మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘షో టైం’. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. షో టైం సినిమా నేడు జూలై 4న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఓ ఇంట్లో రాత్రి 11 గంటల సమయంలో ఫ్యామిలీ కూర్చుని సరదగా మాట్లాడుకుంటుండగా అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ci లక్ష్మీకాంత్ ( రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. దీంతో అక్కడ సూర్య (నవీన్ చంద్ర), శృతి ( కామాక్షి భాస్కర్ల ) సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీ కాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే టైమ్ లో సూర్య, శృతి ఒకర్ని మర్డర్ చేసారని కథలో ఓ కీలక మలుపు తిరుగుతుంది. దాంతో ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు. వారికి లాయర్ వరదరాజులు(VK నరేష్) ఎలా సపోర్ట్ చేసాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : 3BHK Movie : ‘3BHK’ మూవీ రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ..

సినిమా విశ్లేషణ.. ఈ కథ మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథను తీసుకొని థ్రిల్లర్ కథలా మలిచాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్ తక్కువ సమయంలో సింపుల్ గా ముగిసిపోయింది అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ అసలు కథని చూపించారు. నరేష్ ఎంటర్ అయిన దగ్గర్నుంచి సీరియస్ గా నడుస్తున్న కథ కాస్తా కామెడీగా మారుతుంది. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒక రూమ్ లోనే జరగడంతో అక్కడక్కడా బోర్ కొట్టినా బాగానే ఎంగేజ్ చేసారు. క్లైమాక్స్ ఊహించిన దానికి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా నిడివి కేవలం ఒక గంట 45 నిమిషాలే కావడం ప్లస్ అయింది.

show time

నటీనటుల పర్ఫార్మెన్స్.. నవీన్ చంద్ర ఇటీవల వరుస థ్రిల్లర్ సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అలాగే మెప్పించాడు. వరుసగా రూరల్ పాత్రల్లో మెప్పిస్తున్న కామాక్షి ఇందులో సింపుల్ లుక్స్ తో గృహిణి పాత్రలో ఓకే అనిపించింది. నరేష్ తన కామెడీతో నవ్వించారు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రలో బాగానే నడిపించాడు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సింపుల్ కథని థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

‘షో టైం’ సినిమా కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఒక రోజులో జరిగే కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.